ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పాత మద్యం విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం, మద్యం ప్రియులకు మరో బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. తాజాగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌లకు మళ్లీ అనుమతినిచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
వైకాపా హయాంలో పూర్తిగా రద్దైన పర్మిట్ రూమ్‌ల విధానాన్ని తిరిగి ప్రారంభించాలనే నిర్ణయానికి ఎక్సైజ్ శాఖ వచ్చింది. ఆదాయం పెంపునే లక్ష్యంగా సెప్టెంబర్ నుంచే అనుమతులు ఇవ్వనున్నారు. దీనితోపాటు మద్యం దుకాణాల్లో త్రాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.
గతంలో ఏడాదికి ప్రతి దుకాణం నుంచి రూ.5 లక్షలు వసూలు చేయగా, ఇప్పుడు రెండు కేటగిరీలుగా విభజించారు. కార్పొరేట్ నగరాల్లో రూ.7.5 లక్షలు, మిగిలిన ప్రాంతాల్లో రూ.5 లక్షల చొప్పున వసూలు చేయాలని ప్రతిపాదించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,736 మద్యం దుకాణాలు ఉన్నాయి. మొత్తం లెక్కించుకుంటే కనీసం రూ.186 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కార్పొరేషన్ దుకాణాల ద్వారా అదనంగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. 99 రూపాయల క్వార్టర్లతో పాటు ఇప్పుడు పర్మిట్ రూమ్‌లను తెరచేస్తుండటంతో పేద, మధ్య తరగతి మద్యం ప్రియుల్లో హర్షాతిరేకం నెలకొంది.
ఒకవైపు ఆదాయం పెరిగేలా చూస్తూనే, మరోవైపు మద్యం నియంత్రణ పేరుతో సౌకర్యాలు కల్పించడంపై చర్చ మొదలైంది. ఈ విధానంతో రాష్ట్రానికి సంవత్సరానికి రూ.200 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
This post was last modified on July 2, 2025 3:33 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…