పుష్ప 2 ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించాక అట్లీతో చేస్తున్న అల్లు అర్జున్ తర్వాతి లైనప్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కు వెళ్లిపోవడంతో నెక్స్ట్ ఎవరితోననే సందేహం అభిమానుల్లో ఉంది. అప్పుడెప్పుడో ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్టు మీద సైతం అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముడు ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీతో రావణం అనే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి నేరుగా కాకపోయాయినా చూచాయగా చెప్పడం, ఖండించకపోవడం ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది
అయితే నిర్మాణానికి చాలా టైం పట్టొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ముందు జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ పూర్తి చేయాలి. అంటే 2026 సమ్మర్ దాకా ఖాళీ అవ్వడు. ఆ తర్వాత రావణం పనులు మొదలుపెట్టాలి. ఎంతలేదన్నా సంవత్సరం పైగానే పడుతుంది. 2027లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ కొట్టిపారేయలేం. దిల్ రాజు పలు సందర్భాల్లో ప్రశాంత్ నీల్ కొలాబరేషన్ గురించి చెబుతున్నారు కానీ హీరో ఎవరనేది బయట పెట్టలేదు. ఇప్పుడూ చెప్పలేదు కానీ కొట్టి పారేయలేదు. ఆర్యతో కెరీర్ ని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాతగా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఎవడులో బన్నీ క్యామియో చేయడానికి రామ్ చరణ్ తో పాటు దిల్ రాజు కూడా కారణమే.
జానర్ గట్రా తర్వాత సంగతులు కానీ మైథలజి టచ్ ఉంటుందని అంతర్గత సమాచారం. గత కొంత కాలంగా గేమ్ ఛేంజర్ తప్ప పెద్ద సినిమాల జోలికి వెళ్లని దిల్ రాజు ఇకపై స్పీడ్ పెంచబోతున్నారు. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ తో మొదలుపెట్టి తన నుంచి భారీ చిత్రాలను ఆశించవచ్చని ఆల్రెడీ హింట్ ఇచ్చారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే అట్లీతో చేస్తున్న సినిమా ఫైనల్ కాపీ సిద్ధమవ్వడానికి ఎంతలేదన్నా ఏడాదిన్నర పట్టేలా ఉంది. 2027 సంక్రాంతి విడుదలని టార్గెట్ గా పెట్టుకున్నారట. అదైన వెంటనే ప్రశాంత్ నీల్ తో చేతులు కలుపుతారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.
This post was last modified on July 2, 2025 2:55 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…