వైసీపీ నాయకుల్లో ఇప్పుడు ఈ చర్చే సాగుతోంది. ఆ విషయం తేల్చకుండా.. జగన్ తొందరపడ్డా రంటూ.. మెజారిటీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో నాయకులు గడప దాటడంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు.. జగన్ పెట్టిన డెడ్ లైన్ కూడా దాటిపోయింది. ఇంటింటికీ వెళ్లి.. సీఎం చంద్రబాబు గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేయాలని.. ప్రజలను ప్రభుత్వంపై ఉసి గొల్పాలని జగన్ తేల్చి చెప్పారు.
దీనికి ఆయన ఐదు వారాల గడువు కూడా విధించారు. అయితే.. అసలు విషయం ఏంటంటే.. గత ఎన్నికల సమయంలో జగన్ 52 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేశారు. ఉదాహరణకు విజయవాడ సెంట్రల్ లో ఇదే నగరంలోని పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అవకాశం కల్పించారు. ఇక, సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణును త్రిశంకు స్వర్గంలో ఉంచినట్టు ఉంచారు. అయితే.. వెల్లంపల్లి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన యాక్టివ్‌గా కూడా ఉండడం లేదు.
మరోవైపు పశ్చిమలో మైనారిటీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం ఇచ్చారు. ఈయన కూడా ఓడిపోయారు. తర్వాత.. అసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 52 నియోజకవర్గాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఎన్నికలు ముగిసి ఏడాది అయినా.. సదరు నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను నియమించలేదు. పైగా.. ఓడిపోయిన వారిని యాక్టివ్ కూడా చేయలేదు. పోనీ.. పాతవారిని తిరిగి వారి వారి స్థానాలకు కూడా పంపించలేదు.
ఒకటి రెండు చోట్ల(ఉదాహరణకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు(ఎస్సీ), చిలకలూరిపేట(జనరల్) అలా నియ మించినా.. వారు కూడా బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి నియోజకవర్గాల్లో బాధ్యతలపై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోకుండా.. ఇంటింటికీ కార్యక్రమం చేపట్టడంపై నాయకులు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఈ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పు లు చేసిన తర్వాత.. పార్టీ తరఫున కార్యక్రమాలకు పిలుపునిస్తే బాగుండేదని అంటున్నారు. ప్రస్తుతం తాడికొండ సహా పలు చాలా నియోజక వర్గాల్లో నాయకులు కనిపించడం లేదు. కాబట్టి జగన్ ఆయా నియోజకవర్గాల పై నిర్ణయం తీసుకోవాలన్నది వైసీపీ నాయకులు చెబుతున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates