తెలుగులో ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్లలో ఒకరైన స్వేచ్ఛ వొటేర్కర్ ఆత్మహత్యకు పాల్పడడం ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాక.. కవిత్వం రాయడం, సామాజిక సమస్యలపై బలంగా గళం విప్పడం లాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఇలా బలవన్మరణానికి పాల్పడడం జర్నలిస్టు వర్గాలను షాక్‌కు గురి చేసింది. చాలా ఏళ్ల కిందటే భర్త నుంచి విడిపోయిన స్వేచ్ఛకు వయసు మీద పడ్డ తల్లిదండ్రులు, 13 ఏళ్ల కూతురు ఉన్నారు. వాళ్లందరికీ ఆధారం లేకుండా చేసి ఆత్మహత్యకు పాల్పడడాన్ని సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తమ కూతురి మరణానికి పూర్ణ చందర్ అనే వ్యక్తి కారణమని.. ఇప్పటికే పెళ్లయి పిల్లలున్న పూర్ణ చాలా ఏళ్లుగా తమ కూతురితో ఉంటున్నాడని.. స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని.. అతడికి బీఆర్ఎస్ అగ్ర నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని స్వేచ్ఛ తండ్రి ఆరోపించారు. సోషల్ మీడియాలో కూడా చాలామంది స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణ చందరే అంటున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణ చందర్ శనివారం రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం గమనార్హం.
స్వేచ్ఛ తల్లిదండ్రులు పూర్ణచందర్ మీద అక్కడే ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద అతడి మీద కేసులు నమోదైన నేపథ్యంలో అతను అడ్వకేట్ సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంతకంటే ముందు పూర్ణచందర్ తన వెర్షన్ వినిపిస్తూ ఒక లేఖ విడుదల చేశాడు. అందులో కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. స్వేచ్ఛ తనకు 2009 నుంచి తెలుసని.. తామిద్దరం కలిసి ఒక టీవీ ఛానెల్లో పని చేశామని అతను చెప్పాడు. స్వేచ్ఛ వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను తనతో పంచుకునేదన్నాడు. ఐతే 2020 తర్వాతే తమ మధ్య నిజమైన సాన్నిహిత్యం పెరిగిందని అతను తెలిపాడు.
స్వేచ్ఛ మొదటి భర్త నుంచి 2009లో, రెండో భర్త నుంచి 2017లో విడాకులు తీసుకుందని.. 2020 నుంచి తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. తనను ఆమె భర్తగా ఊహించుకుందని పూర్ణ చందర్ పేర్కొన్నాడు. స్వేచ్ఛ మానసిక బాధలకు కారణం తల్లిదండ్రులే అని అతను ఆరోపించాడు. ఉద్యమాల్లో భాగం కావడం వల్ల వాళ్లిద్దరూ స్వేచ్ఛను ఏడాదికి ఒక్కసారి మాత్రమే కలిసేవారని.. దీని గురించి తనతో ఎన్నోసార్లు పంచుకుందని పూర్ణచందర్ తెలిపాడు.
తల్లిదండ్రులతో ఆమెకు తరచూ గొడవలు జరిగేవని.. వాటి వల్లే ఆమె మనోవేదనకు గురయ్యేదని అతనన్నాడు. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుందని.. రెండేళ్ల తర్వాత కూతురిని తన వద్దకు తీసుకొచ్చిందని.. తన భవిష్యత్తు గురించి చాలా ఆందోళనగా ఉండేదని.. తన లాంటి జీవితం కూతురికి వద్దని అనేదని పూర్ణచందర్ తెలిపాడు. కూతురి బాధ్యతలు తనకు అప్పగించిందని.. తాను ఒక తండ్రిలా ఆ అమ్మాయి బాధ్యత తీసుకున్నానని.. స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు తాను ఆమెను పెళ్లి పేరుతో మోసం చేయలేదని పూర్ణ చందర్ స్పష్టం చేశాడు.
This post was last modified on June 29, 2025 2:35 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…