ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలు నిత్యం వాడీవేడీగానే ఉంటున్నాయి. ప్రత్యేకించి జిల్లాలోని తాడిపత్రిలో అయితే ఎప్పుడేం జరుగుతుందో అన్న భయం ఇటు ప్రజల్లో అటు పోలీసుల్లో నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సెలవు దినం ఆదివారం తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రి లోని తన సొంతింంటికి రాగా… ఆయనపై దాడి జరిగే ప్రమాదం ఉందన్న ముందస్తు సమాచారంతో ఆయనను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి పంపించివేశారు.
ప్రస్తుతం పెద్దారెడ్డిని ఆయన ఇంటి నుంచే పోలీసులు బలవంతంగా పంపించివేస్తున్న దృశ్యాలు.. మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఒకానొక దశలో పెద్దారెడ్డి తన ఇంటి నుంచి తానెందుకు వెళ్లాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆయనను బలవంతంగా తీసుకెళ్లే యత్నం చేయగా… తన శక్తిమేర ఆయన ప్రతిఘటించారు. అయితే ఓ పని మీద రంగంలోకి దిగిన పోలీసులు దానిని పూర్తి చేయకుండా ఉండరు కదా. మరింత మంది బలగాలను అక్కడికి రప్పించి పెద్దారెడ్డిని ఎలాగోలా అక్కడి నుంచి పంపించివేసి ఊపిరి పీల్చుకున్నారు.
వాస్తవానికి అనంతపురం జిల్లాతో పాటు మిగిలిన రాయలసీమ జిల్లాల్లో గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. అయితే ఇప్పుడు ఎక్కడ కూడా ఫ్యాక్షన్ అన్న మాటే వినిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తాడిపత్రిలో ఫ్యాక్షన్ కు తిరిగి పురుడు పోసింది పెద్దారెడ్డేనని చెప్పాలి. 2019 వరకు తాడిపత్రిలో ప్రశాంత వాతావరణమే కొనసాగింది. అయితే ఎప్పుడైతే 2019లో పెద్దారెడ్డి వైసీపీీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారో… అప్పటి నుంచే తాడిపత్రిలో ఫ్యాక్షన్ బుసలు కొట్టడం ప్రారంభించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేనన్న అహంతో పెద్దారెడ్డి చేయని పని లేదన్న వాదన లేకపోలేదు.
ప్రత్యేకించి తన రాజకీయ ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగానే టార్గెట్ చేసిన పెద్దారెడ్డి… జేసీ తన ఇంటిలో లేని సమయం చూసుకుని ఆ ఇంటిపై అనుచరులతో కలిసి దాడికి దిగారు. నేరుగా జేసీ ఇంటిలోపలికి వెళ్లిన పెద్దారెడ్డి… జేసీ తన కోసం ప్రత్యేకంగా చేయించుకున్న కుర్చీలో కూర్చు,ని కాలుపై కాలేసుకుని దర్పం ప్రదర్శించారు. ఈ చర్య జేసీని, ఆయన అనుచర వర్గాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేయగా… జేసీ లేకున్నా కూడా ఆయన వర్గం పెద్దారెడ్డిపై ప్రతిదాడికి దిగింది. దీంతో పెద్దారెడ్డి అక్కడి నుంచి ఫలాయనం చిత్తగించారు. నాడు అంత రచ్చ చేసి నేడు తన ఇంటికి తనను ఎందుకు వెళ్లనీయరు? అంటూ జేసీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
This post was last modified on June 29, 2025 3:19 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…