జ‌గ‌న్ దూకుడుతో టీడీపీ మ‌రింత బ‌ల ప‌డితే..?!

ఆశ ఉండొచ్చు. అది రాజ‌కీయ నాయ‌కుల ల‌క్ష‌ణ‌మే కాదు.. సాధార‌ణ ప్ర‌జ‌ల ల‌క్ష‌ణం కూడా. కానీ… అత్యాసే ఎప్పుడూ ఎవ‌రినై నా ముంచేస్తుంది. అది నాయ‌కుల‌నైనా.. వ్య‌క్తుల‌నైనాకూడా! ఇప్పుడు అదే అత్యాస జ‌గ‌న్‌లోనూ క‌నిపిస్తోంది. ముందు త‌న‌ప రిస్థితిని.. త‌న పార్టీ ప‌రిస్థితిని అంచ‌నా వేసుకునే విష‌యంలో విఫ‌ల‌మ‌వుతున్న‌జ‌గ‌న్‌.. ఇప్పుడు టీడీపీపై దృష్టి పెట్టారు. తాజా గా జ‌రిగిన ఓ స‌మావేశంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావ‌ని వ్యాఖ్యానించారు. దీనిని టీడీపీ నేత‌లు కాదు.. వైసీపీ నాయ‌కులే న‌వ్వుకునే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది.

ఎందుకంటే.. వైసీపీతో పోల్చుకుంటే.. టీడీపీకి ఉన్న శ‌క్తి అపారం. ఈ విష‌యం జ‌గ‌న్‌కు కూడా తెలియంది కాదు. 2024 ఎన్నిక ల్లో టీడీపీ శ‌క్తి అంద‌రికీ తెలిసి వ‌చ్చింది. ఎక్క‌డెక్క‌డి నుంచో కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి వ‌చ్చారు. విదేశాల నుంచికూడా కార్య‌క‌ర్త‌లు వ‌చ్చారు. గ్రామ గ్రామానా తిరిగారు. అత్య‌ధిక బ‌లంతో ప్ర‌చారం చేశారు. ఇదేమీ సాధార‌ణ విష‌యం కాదు. అంతేకాదు.. పార్టీ కార్య‌క‌ర్త‌లంతా ఏక‌తాటిపై నిలిచారు. చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మిని గెలిపించారు. క‌ట్ చేస్తే.. ఇంత బ‌ల‌మైన శ‌క్తి వైసీపీలో మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌దు. అంతేకాదు.. ఎవ‌రూ కూడా ఇంత బ‌లంగా పోరాడిన వారు కూడా లేరు.

అలాంటి పార్టీ ఇప్పుడు టీడీపీని ఏకాకిని చేస్తామ‌ని.. డిపాజిట్లు రాకుండా చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా.. లేనిపోని విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకోవ‌డ‌మే త‌ప్ప‌.. వ్యూహాత్మ‌క రాజ‌కీయాలు చేస్తున్నార‌న్న ఆలోచ‌న‌ను పురిగొల్ప‌లేక పోతున్నారు. పైగా సొంత పార్టీలోనే ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను విమ‌ర్శించే వారు.. జ‌గ‌న్ వ్యూహాల‌ను ఎద్దేవా చేస్తున్న‌వారు క‌నిపిస్తున్నారు. నిజానికి జ‌గ‌న్ చెబుత‌న్న‌దే నిజ‌మ‌ని అనుకున్నా.. గ‌తంలో 2009, 2004 ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన వైఎస్ ప్ర‌భావం ఉన్న‌ప్పుడు కూడా.. టీడీపీకి ఇలాంటి డిపాజిట్లు కోల్పోయే ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సీట్లు త‌గ్గినా.. బ‌లం బ‌ల‌గాన్ని నిల‌బెట్టుకుంది.

ఇక‌, వైసీపీ ఉద్రుతంగా ఉన్న 2019 ఎన్నిక‌ల్లో కూడా.. టీడీపీ త‌న శ‌క్తిని కోల్పోలేదు. 23 స్థానాల‌కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ.. టీడీపీ ఓటు బ్యాంకు.. మాత్రం సుస్థిరంగానే నిలిచింది. ఎక్క‌డా డిపాజిట్లు కోల్పోయిన నాయ‌కులు క‌నిపించ‌లేదు. ఓడిన నాయ‌కులు మాత్ర‌మేక‌నిపించారు. సో.. జ‌గ‌న్ ఏ అంచ‌నాల ప్ర‌కారం.. టీడీపీకి డిపాజిట్టు కూడా రాబోవ‌ని చెబుతున్నారో.. ఆయ‌న పునః ప‌రిశీల‌న చేసుకోవాలి. లేక‌పోతే.. జ‌గ‌న్ వ్యాఖ్య‌లే ఆయుధాలై.. టీడీపీ శ్రేణుల‌ను మ‌రింత బ‌లంగా ముందుకు న‌డిపిస్తే.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు వైసీపీకి రివ‌ర్స్ అయ్యే ప్ర‌మాదం ఉంది.