స‌ర్‌ప్రైజ్‌… వైసీపీకి చంద్ర‌బాబు మేలైన సూచ‌న‌!

అదేంటి అనుకుంటున్నారా?  ఔను.. నిజ‌మే. వైసీపీపై నిత్యంనిప్పులు చెరిగే సీఎం చంద్ర‌బాబు.. తాజాగా మేలైన సూచ‌న చేశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూల‌న‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ప‌నిచేస్తోంద‌న్న ఆయ‌న ప్ర‌తిప‌క్షాలు కూడా స‌హ‌క‌రించాల‌ని ప‌రోక్షంగా వైసీపీకి సూచించారు. క‌ల‌సి క‌ట్టుగా గంజాయి, డ్ర‌గ్స్‌పై పోరాటం చేద్దామ‌ని పిలుపునిచ్చారు. గురువారం `యాంటీ నార్కోటిక్ డే`ను పుర‌స్క‌రించుకుని గుంటూ రులో నిర్వ‌హించిన ర్యాలీలో చంద్ర‌బాబు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వం గంజాయి సాగును కుటీర ప‌రిశ్ర‌మ‌గా మార్చింద‌ని ఎద్దేవా చేశారు. త‌మ ప్ర‌భుత్వం గంజాయి స‌హా.. మాద‌క ద్ర‌వ్యాల‌పై ఉక్కుపాదం మోపుతోంద‌న్నారు. గం జాయి నిర్మూల కేవ‌లం ప్ర‌భుత్వ ప‌ని మాత్ర‌మే కాద‌న్న సీఎం.. దీనికి అంద‌రూ క‌లిసి రావాల‌ని సూచిం చారు. దీనిలో ప్ర‌తిప‌క్షాలుకూడా పాల్గొనాల‌ని సూచించారు. “ప్ర‌జ‌ల‌ను మెప్పించి ఓట్లు వేయించుకోండి“ అని ప్ర‌తిప‌క్షానికి సూచించారు.

రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నాలు చేయొద్ద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామ‌న్నారు. ముఖ్యంగా డ్ర‌గ్స్ నిర్మూల‌న‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్న ఆయ‌న‌… తొలిసారి సినీ రంగంపై స్పందించారు. సినీరంగా నికి చెందిన ప్ర‌ముఖులు కూడా.. యాంటీ డ్ర‌గ్స్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాలని సూచించారు. స‌మాజానికి మేలు చేసే కార్య‌క్ర‌మాల్లో పాల్గొని మార్పు తీసు కురావాల‌ని కోరారు.

2021లో ఏపీ నుంచి 50 శాతం గంజాయి దేశం మొత్తానికి స‌ర‌ఫ‌రా అయింద‌ని విమ‌ర్శించిన సీఎం చంద్ర బాబు.. దీనిని క‌ట్టడి చేసేందుకు అప్ప‌టి ప్ర‌భుత్వం కృషి చేయ‌లేద‌న్నారు. పైగా.. విశాఖ‌ప‌ట్నాన్ని మ‌త్తు కు కేంద్రంగా మార్చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇక‌పై అలా చేసేందుకు లేద‌న్నారు. ఈగ‌ల్ టీంల ద్వారా ప‌క్కా నిఘా పెడుతున్నామ‌ని చెప్పారు.