టార్గెట్ @ 2035.. ప‌వ‌న్ చెప్పేశారు!

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యింది. అయితే.. మ‌రో నాలుగేళ్ల‌కు ఎన్నిక‌లు వ‌స్తా యి. కానీ, అధికారంలో ఉన్న కూట‌మి నిర్దిష్ట ల‌క్ష్యం పెట్టుకుంది. అదే.. మ‌ళ్లీ తామే అధికారంలో ఉండా లని!. అలా ఉంటేనే సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల‌ను సాధించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కూట‌మి పాల‌కులు చెబుతున్నారు. అయితే.. దీనిలో ఒక నిర్దిష్ఠ గ‌డువు అంటూ ఏమీ చెప్ప‌క‌పోయినా.. తాజాగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్యాల‌ను బ‌ట్టి కూట‌మి స‌ర్కారు టార్గెట్ అర్ధ‌మ‌వుతోంది.

రాజ‌మండ్రిలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌.. కేంద్ర మంత్రి గ‌జేంద్రసింగ్ షెకావ‌త్‌తో క‌లిసి `అఖండ గోదావ‌రి` ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చేసిన కీల‌క వ్యాఖ్య‌లు కూట‌మి స‌ర్కారు ల‌క్ష్యాన్ని స్ప‌ష్టంగా చెప్పాయి. “2035 నాటికి రాష్ట్రంలో ప్ర‌పంచ‌స్థాయిలో ప‌ర్య‌ట‌క రంగాన్ని డెవ‌ల‌ప్ చేస్తాం“ అని వెల్ల‌డించారు. అంటే.. దీన‌ర్థం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అప్ప‌టి వ‌ర‌కు త‌మ ప్ర‌భుత్వ‌మే ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు.

బుధ‌వారం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలోనూ సీఎం చంద్ర‌బాబు దాదాపు ఇదే మాట చెప్పారు. అయితే.. ఆయ‌న నిర్దిష్ట‌మైన గ‌డువు చెప్ప‌లేదు. కానీ, తాజాగా గురువారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కూట‌మి భాగ‌స్వామిగా ఉన్న ప‌వ‌న్ దీనికి గ‌డువు చెప్ప‌క‌నే చెప్పారు. దీనిని బ‌ట్టి 2029, 2034 ఎన్నిక‌ల్లోనూ.. కూట‌మి విజ‌య‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది.

ఇక‌, చంద్ర‌బాబు విజ‌న్ 2047 అంటున్నా.. దీనిపై ఆయ‌న నిర్దిష్టంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. దీనిని ఇప్పుడు ప‌వ‌న్ చేసిన కామెంట్లే.. టార్గెట్ @ 2035 అని భావించాల్సి ఉంటుంది. సో.. దీనిని బ‌ట్టి రాష్ట్రంలో మ‌రో పార్టీకి కానీ.. మ‌రోనేత‌కు కానీ.. ఛాన్స్ ఇచ్చేది లేద‌ని స్ప‌స్టం చేసిన‌ట్టు అయింది. మ‌రి అధికారంపై ఆశ‌లు పెట్టుకున్న‌వారు… అప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందేనేమో!!.