జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యణ్ వస్త్రధారణలో చాలా ప్రత్యేకతను చూపుతారు. ఏ కార్యక్రమానికి ఎలాంటి వస్త్రధారణ అవసరమో… అందుకనుగుణంగానే ఆయన వెళతారు. అందులో భాగంగా ఇప్పటిదాకా ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల్లో ఆయన సినిమా హీరో లుక్కుతో కనిపించేలా వెళ్లలేదు. అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ గురువారం పవన్… రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించిన అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం సినీ హీరో లుక్కుతో వెళ్లి అందరినీ ఆకట్టుకున్నారు.
గోదావరి తీరం వెంట పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ది కోసం అఖండ గోదావరి పేరిట కేంద్రం ఓ కొత్త ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.94.4 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా ప్రాజెక్టులకు కేంద్రం మొత్తంగా రూ.375 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టులను ప్రారంబించేందుకు గజేంద్ర సింగ్ షెకావత్ రాగా… రాష్ట్ర ప్రభుత్వం తరఫున పవన్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్బంగా పవన్ గతంలో నటించిన అజ్ఞాతవాసి సినిమాలో ఎలాంటి లుక్కులో కనిపించారో… గురువారం అదే లుక్కులో పవన్ హాజరయ్యారు. క్రీమ్ కలర్ ప్యాంట్, దానిపై లైట్ గ్రీన్ షర్ట్ వేసి, ఇన్ షర్ట్ చేసుకుని నీట్ గా టిప్ టాప్ గా కార్యక్రమానికి హాజరైన పవన్ నిజంగానే జనంతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన రాజకీయ నేతలను కూడా అమితంగా ఆకట్టుకున్నారు. కార్యక్రమం అంతా హుషారుగా కనిపించిన పవన్… తన ప్రసంగంలో నవ్వులు పూయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates