ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న కర్నూలు జిల్లాలోని బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ప్రెస్‌క్లబ్‌లో తాజాగా కవిత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడు తూ.. తమ హయాంలోనూ తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు. బీఆర్ ఎస్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలని పోరాటం చేశామన్నారు.
అయితే.. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలవరం ఆపివేయలేక పోయామన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడే.. తాము వ్యతిరేకించామన్నారు. చివరకు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు ప్రయత్నించామన్నారు. కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలుపుదల చేయలేక పోతున్నారు. పైగా మోడీ సర్కారు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందని గుర్తు చేశారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. ఇప్పుడు బనకచర్ల విషయంలోనూ ఇదే జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నా అని కవిత అన్నారు.
తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీ అన్యాయంగా తీసుకుందని కవిత అన్నారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం చేకూరిందని చెప్పారు. వీటితోపాటు లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా అప్పగించా రని అన్నారు. ఈ విషయంపైనా తాను ఎంపీగా పోరాటం చేశానన్నారు.కానీ, తన ప్రయత్నం ఫలించలేద ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకుంటూ పోవడంతో ముంపు పెరిగిపోతోంది అని కవిత వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో తమ నుంచి గుంజుకున్న ఏడు మండలాల్లో ఐదు మండలాలను తిరిగి తెలంగాణకు అప్ప గించాలని కవిత డిమాండ్ చేశారు. పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపా డులను తెలంగాణకు అప్పగించాల్సిందేనని కోరారు. బనకచర్లను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు కవిత చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates