టీడీపీలోకి గుంటూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌?

లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీలు వేరు అయిన వరుసగా రెండుసార్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎంపీగా గెలిచిన నాయకుడు. విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య వారసుడిగా రాజకీయాలలోకి వచ్చిన శ్రీకృష్ణదేవరాయులు 2019లో తొలిసారి వైసీపీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపి కండువా కప్పుకున్న ఆయన వైసీపీ నుంచి పోటీ చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఘనవిజయం సాధించి వరుసగా రెండోసారి అదే నియోజకవర్గం నుంచి పార్లమెంటులోకి అడుగు పెట్టారు. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వంలో లావు చాప‌కింద నీరులా ప‌నులు చ‌క్క‌పెడుతూ సైలెంట్ వ్యూహాల‌తో త‌న బ‌లం పెంచుకుంటున్నారు.

టిడిపి ఎంపీగా ఉన్న లావు గతంలో వైసీపీలో ఉన్నప్పుడు తనతో పాటు పనిచేసిన కమ్మ సామాజిక వర్గ నాయకులను ఇప్పుడు టిడిపిలోకి తీసుకు వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ను టిడిపిలోకి తీసుకువచ్చిన లావు ఇప్పుడు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును సైతం టిడిపిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఎన్నిక‌ల‌కు ముందు గుర‌జాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని, వినుకొండ‌ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావును సైతం టిడిపిలోకి తీసుకురావడంలో లావు విజయం సాధించారు. మల్లికార్జున రావుకు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి, జంగాకు నామినేటెడ్ ప‌ద‌వి ఇప్పించారు. ఇప్పుడు నంబూరు శంకరరావును సైతం టిడిపిలోకి తీసుకువస్తే పెదకూరపాడులో పార్టీ మరింత బలంగా ఉంటుందన్న ఆలోచనలో లావు ఉన్నట్టు తెలుస్తోంది. అంటే త‌న‌తో పాటు వైసీపీలో ప‌నిచేసిన టీంను అంతా లావు టీడీపీలోకి లాగేస్తూ అధిష్టానానికి మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు. అయితే నంబూరును పార్టీలో చేర్చుకునే విష‌యంలో పెద‌కూర‌పాడు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న భాష్యం ప్రవీణ్ కాస్త లావుపై కినుక వహిస్తున్నట్టు తెలుస్తోంది.