Political News

ప‌ట్టుబ‌ట్టి.. రికార్డు కొట్టిన చంద్ర‌బాబు!

ఒక కృషి-ఒక ప‌ట్టుద‌ల ఉంటే విజ‌యం దానంత‌ట అదే వ‌రిస్తుంద‌ని చెప్ప‌డానికి తాజాగా విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన అంత‌ర్జాతీయ యోగా దినోత్సవ‌మే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. దీనిని ప్ర‌పంచ దేశాలు మెచ్చేలా చేయాల ని.. గిన్నిస్ రికార్డు సాధించాల‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో నెల రోజుల ముందు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర మాసోత్స‌వాల‌ను కూడా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీని ఆయ‌న ఆహ్వానించారు. దీంతో దీనికి మ‌రింత హైప్ పెరిగింది.

అంతేకాదు.. ద‌గ్గ‌ర ఉండి.. కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌ను కూడా సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌వేక్షించారు. ప్ర‌తి విష‌యాన్నీ నిశితంగా గ‌మ‌నించారు. ఎక్క‌డా ఎలాంటి లోటు పాట్లు లేకుండా, రాకుండా చూసుకున్నారు. సుమారు 5 ల‌క్ష‌ల మందితో విశాఖ‌లోని ఆర్కే బీచ్ నుంచి 29 కిలో మీట‌ర్ల దూరంలోని భీమిలి నియోజ‌క వ‌ర్గంలోని తీరం వ‌ర‌కు నిర్వ‌మించిన ఈ యోగా కార్య‌క్ర‌మం సూప‌ర్ స‌క్సెస్ అయింది. ఎక్క‌డా ఎలాంటి పొరపాట్ల‌కు తావు లేకుండా.. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతంగా నిర్వ‌హించారు.

దీంతో యోగాంధ్ర-2025 రికార్డు సృష్టించింది. విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ ప్ర‌పంచ రికార్డు సాధించింది. 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని యోగాస‌నాలు వేశారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వ‌ర‌కు చీమ‌ల దండు మాదిరిగా యోగా వేసేందుకు వ‌చ్చిన వారు క్యూ క‌ట్టారు. ప్ర‌త్యేక శిక్ష‌కుల ద్వారా ప్ర‌తి 10 వేల మందికి ఒక‌రు చొప్పున నియ‌మించి.. యోగాస‌నాలు వేయించారు.

ప్ర‌పంచ రికార్డు!

తాజాగా విశాఖ‌లో నిర్వ‌హించిన యోగా కార్య‌క్ర‌మం రికార్డు సృష్టించింది. గ‌తంలో గుజ‌రాత్‌లోని పారిశ్రా మిక ప‌ట్ట‌ణం సూర‌త్‌లో నిర్వహించిన యోగాలో 1.47 లక్షల మంది పాల్గొన్నారు. ఇదే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డు. తాజాగా నిర్వ‌హించిన విశాఖ యోగాలో ఏకంగా 3 ల‌క్ష‌ల 10 వేల మంది పాల్గొని యోగాస‌నాలు వేశారు. దీంతో అన్ని రికార్డుల‌ను చెరిపేసి.. స‌రికొత్త రికార్డు సృష్టించింది. ఇదంతా.. చంద్ర‌బాబు కృషి, ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని.. విశాఖ వాసులు పేర్కొన్నారు.

This post was last modified on June 21, 2025 10:35 am

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

52 seconds ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

8 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

8 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

8 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

8 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

10 hours ago