Political News

శంషాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు

బీఆర్ ఎస్ నాయ‌కుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ క్వారీ య‌జ‌మానిని బెదిరించిన కేసులో ఆయ‌న‌ను శ‌నివారం ఉద‌యం వ‌రంగ‌ల్ జిల్లా సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన స‌మయంలో పాడిని పోలీసులు అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. క్వారీ య‌జ‌మాని మ‌నోజ్‌కుమార్ నుంచి రూ.50 ల‌క్ష‌లు కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశార‌నే ఆరోప‌ణ‌లు వున్నాయి.

దీనిపై పోలీసులు కొన్నాళ్ల కింద‌టే కేసు న‌మోదు చేశారు. అయితే..ఈ కేసును కొట్టివేయాల‌ని.. ఇది రాజ‌కీయ ప్రేరేపిత కేసు అని పేర్కొంటూ.. కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే.. అక్క‌డ ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేదు. పైగా.. ఇలాంటి కేసుల్లో తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌నికూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఇది జ‌రిగిన రెండు రోజుల త‌ర్వాత‌.. కౌశిక్ రెడ్డిని శ‌నివారం ఉద‌యం హ‌నుమకొండ‌లో పోలీసులు అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఆయ‌న‌పై బీఎన్ ఎస్ సెక్ష‌న్ 308(2), 350(1) కింద కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఈ స‌మ‌యంలో పోలీసుల‌కు, కౌశిక్ రెడ్డికి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. త‌న‌ను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ పోలీసుల‌ను ఆయ‌న గ‌ద్దించారు. దీంతో అరెస్టు వారెంటుతో పాటు.. కేసుకు సంబంధించిన కాపీని కూడా పోలీసులు ఆయ‌న‌కు అందించారు. అక్క‌డి నుంచి వ‌రంగ‌ల్‌కు ప్ర‌త్యేక కాన్వాయ్‌లో కౌశిక్‌ను త‌ర‌లించారు.

ఇక‌, కౌశిక్ రెడ్డి అరెస్టు పై బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు కేటీఆర్‌, హ‌రీష్‌రావులు నిప్పులు చెరిగారు. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన వారిపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఏం నేరం చేశాడ‌ని కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశార‌ని ప్ర‌శ్నించారు. రాజ‌కీయ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశార‌ని.. ఈ విష‌యాన్ని కోర్టుల్లోనే తేల్చుకుంటామ‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

This post was last modified on June 21, 2025 9:41 am

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

44 minutes ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

1 hour ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

2 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

2 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

2 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

3 hours ago