ఫార్మూలా ఈ కారు రేసుల వ్యవహారంలో ఇప్పటిదాకా రెండు పర్యాయాలు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరైన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన రెండో దఫా విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు… 2021 నుంచి 2024 మధ్యలో వినియోగించిన సెల్ ఫోన్లను స్వాధీనం చేయాలని కేటీఆర్ ను కోరారు. అయితే ఇఫ్పుడు వాటిని తీసుకురాలేదని తప్పించుకున్న కేటీఆర్ తాజాగ బుధవారం అసలు ఆ ఫోన్లు ఇప్పుడు తన వద్ద లేవని ఏసీబీకి షాకిచ్చేలా ఓ లేఖ రాశారు.
2021 నుంచి 2023 చివరి వరకు తాను వాడిన ఫోన్లను తీసేసి… 2024లో కొత్త ఫోన్లను తీసుకున్నానని కేటీఆర్ ఏసీబీకి రాసిన లేఖలో తెలిపారు. గతంలో వాడేసిన ఫోన్లను తాను తన వద్ద ఎందుకు ఉంచుకుంటానని ప్రశ్నించిన కేటీఆర్… ప్రస్తుతం ఆ పాత ఫోన్లు ఇప్పుడు తన వద్ద లేవని, అసలు అవి ఎక్కడున్నాయో కూడా తనకు తెలియదని తెలిపారు. వాడేసిన ఫోన్లను డిస్పోజ్ చేస్తాం కదా… డిస్పోజ్ చేసిన ఫోన్లను తీసుకురమ్మంటే ఎలా తీసుకువచ్చేది అంటూ ఆయన ఓ లాజిక్ ను వినియోగించాురు.
ఏసీబీకి రాసిన లేఖను కేటీఆర్ ఈ విషయాలతోనే సరిపెట్టేసి ఉంటే సరిపోయేది. అయితే ఆయన అలా చేయలేదు. ఫోన్లను స్వాధీనం చేయడమంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఈ తరహా చర్యలు తన వ్యక్తిగత ప్రతిష్ఠను మంటగలిపేవేనని కూడా కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద పాత ఫోన్లు లేవంటూనే.. ఇలా వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుంది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
This post was last modified on June 18, 2025 10:50 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…