ఏపీలో 2019 నుంచి ఐదేళ్ల పాటు సాగిన వైసీపీ పాలనను వైరి వర్గాలు దౌర్జన్య పాలనగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని 2024 ఎన్నికల్లో ప్రజల వద్దకు తీసుకెళ్లి… దౌర్జన్యకాండకు పాల్పడుతున్న వైసీపీని విపక్షంలోకి కూటమి పార్టీలు నెట్టేశాయి. అంతటితో వైసీపీ దౌర్జన్యాలు ఆగుతాయిలే అని అంతా అనుకున్నారు. అలా అనుకున్న వారి ఆశలు అడియాశలే అయ్యాయని చెప్పక తప్పదు. ఇప్పటికీ మెజారిటీ శాఖల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులే చక్రం తిప్పుతున్నారన్న వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వైసీపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి భర్త… కూటమి నేతలపై విరుచుకుడిపోయారు. ఏకంగా పురపాలక సమావేశంలోనే వారిపై దౌర్జన్యానికి దిగారు.
ఈ ఘటన ఎక్కడో మారుమూల జిల్లాల్లో జరిగింది కాదు. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోని గుంటూరు జిల్లా తెనాలి మునిసిపాలిటీలో శనివారం చోటుచేసుకోవడం గమనార్హం. శనివారం పురపాలక సర్వసభ్వ సమావేశం జరిగింది. మునిసిపల్ చైర్మన్ హోదాలో వైసీపీకి చెందిన రాధిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పురపాలక సంఘంలో ఎలాంటి హోదా లేకున్నా… ఆమె భర్త రమేశ్ దర్జాగా ఎంట్రీ ఇచ్చేశారు. చైర్ పర్సన్ భర్తగా డాబూ దర్పం ఒలకబోస్తూ జనరల్ బాడీ మీటింగ్ లోకి రమేశ్ ఎంట్రీ ఇచ్చిన తీరు ఒక ఎత్తు అయితే… నేరుగా చర్చలో పాలుపంచుకుంటూ టీడీపీ కౌన్సిలర్లపై ఆయన ఒంటికాలిపై లేచారు. ఒకానొక సందర్భంలో ఆయన ఏకంగా టీడీపీ సభ్యులపై దాడికి యత్నించారు.
తెనాలి మునిసిపల్ జనరల్ బాడీ మీటింగ్ లో తనకు ప్రవేశ అర్హతే లేదని తెలిసినా కూడా సమావేశానికి వచ్చిన రమేశ్… సమావేశంలో టీడీపీ సభ్యులపై బూతుల దండకం అందుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన రమేశ్ అనుచరులు ఆయనను బలవంతాన బయటకు తీసుకెళ్లారు. చైర్ పర్సన్ కుర్చీలో ఎంచక్కా ఆసీనులైన రాధిక.. తన కళ్లెదుటే ఇంత జరుగుతున్నా కూడా పల్లెత్తు మాట అనలేదు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశానికి రావడమే కాకుండా కౌన్సిలర్లపై విరుచుకుపడిన తన భర్తను ఆమె నిలువరించే యత్నమే చేయలేదు. చైర్ పర్సన్ కుర్చీలో ఆమె అలా ఉత్సవ విగ్రహంగా కూర్చుండిపోయారు.
ఇక ఎలాగోలా రమేశ్ ను ఆయన అనుచరులు బయటకు తీసుకెళ్లగా… పురపాలికలో ఎలాంటి హోదా లేకున్నా సమావేశానికి హాజరై… తమపైనే విరుచుకుపడిన రమేశ్ తీరుపై టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా తెనాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురపాలికలో కౌన్సిలర్ కాకున్నా సమావేశానికి రమేశ్ హాజరయ్యారని, తమపై దాడికి యత్నించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వారు సదరు ఫిర్యాదులో పోలీసులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా… ఇక్కడ జనసేనకు చెందిన కీలక నేత, సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి నియోజకవర్గంలో విపక్షానికి చెందిన ఓ నేత ఇంత బరితెగింపునకు పాల్పడిన తీరుపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
This post was last modified on June 1, 2025 3:06 pm
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…