సర్వే రాయుడిగా పేరొందిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఏం చేసినా కొలతలు తీసుకుంటారు. ఎప్పటికప్పు డు ప్రజల సంతృప్తికి లెక్కలు వేసుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన పలు సర్వేలు నిర్వహించడం రివాజే. అయితే.. ఎవరైనా.. విద్య, వైద్యం, ప్రభుత్వ పాలన, మౌలిక సదుపాయాల గురించి ఆరా తీస్తారు. ప్రజల నాడి తెలుసుకుంటారు. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను బట్టి.. వాటిలో మార్పులు చేర్పుల దిశగా అడుగులు వేస్తారు. ఇది కామనే.
అయితే.. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అమలు చేస్తున్న మద్యం విధానంపై సర్వే చేపట్టారు. దీనిని రెండు దశలుగా చేస్తున్నారు. ఐదు ప్రశ్నల తో వైన్స్ దుకాణాల దగ్గర, మూడు ప్రశ్నలతో బార్ల దగ్గర క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసి.. మందు బాబుల మనసులోని మాటలు వింటున్నారు. మరి ఈ ఐడియా ఎవరిచ్చారో.. లేక.. జగన్ హయాంలో మందు బాబులకు రేగిన తిక్క.. తర్వాత ఎన్నికలలో వచ్చిన లెక్కను పరిశీలించారో తెలియదు.
కానీ.. చంద్రబాబు సూపర్ ఐడియా వేసి.. రెండు దశల్లో మంద్యంపై మందుబాబుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఇది అమల్లోనే ఉంది. ట్రై చేయాలనుకునేవారు ఎవరైనా చేయొచ్చు. క్యూ ఆర్ కోడ్ను స్కార్ చేస్తే.. దీనిలో పేరు, వివరాలు, అడ్రస్ నమోదు చేశాక.. వైన్స్ అయితే.. ఐదు, బార్లయితే మూడు ప్రశ్నలు కనిపిస్తాయి. వీటికి సమాధానం ఇస్తే చాలు. ఇదీ.. సర్వే. అయితే..ఈ సర్వేలో బాబుకు మందుబాబులు.. భారీ షాకిచ్చారు.
24/7 మద్యం షాపులు తీసి ఉంచాలన్నది మెజారిటీ బాబు కోరుకున్నారు. ఇక, మద్యం నాణ్యత విషయం పై భారీ సంతృప్తి వ్యక్తమైంది. ధరల విషయంలోనూ దాదాపు 50 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఏకైక సమాధానం ఏంటంటే.. 24/7 షాపులు ఉంచితే మీకు అభ్యంతరమా? అంటే.. ఉంచాలని సమాధానం చెప్పడం. నిజానికి ఇప్పటికే అనధికారికంగా.. షాపులను ఉదయం 5 గంటలకే తీసేస్తున్నారు. దీనిపై విమర్శలు వచ్చినా పట్టించుకోవడం లేదు. ఇక, ఇప్పుడు సర్వేలోనే ఇలా బాబులు కోరడంతో సీఎం చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on May 19, 2025 1:57 pm
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి…
రిలీజ్ ముందు బజ్ లేకుండా, విడుదలైన రోజు కొందరు క్రిటిక్స్ దారుణంగా విమర్శించిన దురంధర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని…