జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్ గురించి ఎలాంటి కదలిక లేక అభిమానులు తెగ ఇదైపోతున్నారు. ఇవాళ కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ హ్యాండిల్, జూనియర్ ఎన్టీఆర్ వేర్వేరుగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఎక్కడా దేవర 2 ప్రస్తావన కానీ, త్వరలో మొదలుపెడదామనే సూచన కానీ ఇవ్వకుండా మెసేజ్ పెట్టారు. అంటే తెరకెక్కే సూచనలు తగ్గినట్టే.
ప్రస్తుతం కొరటాల శివ బాలకృష్ణ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. స్క్రిప్ట్ లాకైపోగా క్యాస్టింగ్ వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పక్కా ప్రణాళికతో చేసుకుంటున్నారు. గోపీచంద్ మలినేనితో చేస్తున్న ఎన్బికె 111 ఆగస్ట్ లో అయిపోతుందనే వార్తల నేపథ్యంలో వెంటనే కొరటాల సెట్స్ లో బాలయ్య అడుగు పెట్టేలా ప్లానింగ్ జరిగిపోయిందట. అయితే నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది, 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తారా లేదానే క్లారిటీ ఇంకా లేదు.
ఇక దేవర 2 విషయానికి వస్తే మరీ ఎక్కువ ఆలస్యం చేయడం వల్ల జనంలో బజ్ తగ్గిపోతుంది. అసలు డ్రాగన్ తోనే యమా బిజీగా ఉన్న తారక్ వేరే దేని గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. అలాంటప్పుడు దేవర 2కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని చెప్పలేం, దేవరని ఎవరు చంపారు, కొడుకు వర ఏం చేశాడు, అసలు విలన్లు ఇంకా ఎవరెవరు ఉన్నారు లాంటి బోల్డు ప్రశ్నలకు దేవర 2 సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఈ మాత్రం డిమాండ్ ఉంది.
చూస్తుంటే మొత్తానికి అటక ఎక్కించినట్టే ఉన్నారు. దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి గ్యాప్ వచ్చేసింది. టెంపర్ నుంచి కొనసాగుతున్న జైత్రయాత్రకు వార్ 2 బ్రేక్ వేయడం తారక్ కు బొత్తిగా నచ్చలేదు. అందుకే తొందపాటు నిర్ణయాలు తీసుకోకుండా బాగా ప్లాన్డ్ గా ఉన్నాడు. ముఖ్యంగా డ్రాగన్ కోసం మాములుగా కష్టపడటం లేదు. ఎక్కువ డేట్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ తనవరకు బెస్ట్ ఇస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ఈసారి అవుట్ అఫ్ ది బాక్స్ హింసని ప్రెజెంట్ చేయబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.
This post was last modified on June 15, 2026 6:47 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…