Movie News

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు భారీ వసూళ్లు వస్తుంటాయి. జనం ఎగబడి ఆ సినిమాను థియేటర్లలో చూసేస్తుంటారు. అలాగే కొన్ని సినిమాలకు టాక్ బాగున్నా సరే.. జనానికి రీచ్ కాకపోవడం వల్ల, బాక్సాఫీస్ దగ్గర ప్రతికూల పరిస్థితుల వల్ల అవి బాగా ఆడవు. ఐతే ఓటీటీలో రిలీజైనపుడు ఈ రెండు రకాల సినిమాలకూ స్పందన భిన్నంగా ఉంటుంది. అనుకోకుండా బాగా ఆడిన సినిమాను తెగనాడుతుంటారు.

అలాగే పరిస్థితులు కలిసి రాక సరిగా ఆడని సినిమాలు చూసి జాలి పడుతుంటారు. సూర్య సినిమా ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) మొదటి కోవకే చెందుతుంది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విజయవంతమైంది. తెలుగులో అయినా ఒక మోస్తరుగా ఆడింది కానీ.. తమిళంలో అయితే బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా రూ.330 కోట్ల వసూళ్లతో ఈ ఏడాదికి తమిళంలో అతి పెద్ద హిట్‌గా నిలవడమే కాదు.. సూర్య కెరీర్లోనూ హైయెస్ట్ గ్రాసర్ అయింది.

ఐతే ఇటీవలే ‘కరుప్పు’ను ఓటీటీలోకి తీసుకొచ్చారు. తెలుగు వెర్షన్ ‘వీరభద్రుడు’ సైతం అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు.. తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేం సినిమా.. ఇది ఎలా హిట్టయింది.. థియేటర్లలో బాగా ఆడింది కదా అని చూస్తే రెండున్నర గంటలు వేస్ట్ అయ్యాయి అంటూ ఈ సినిమా మేకర్స్ మీద మండిపడుతున్నారు. నిజానికి తమిళంలో అంత పెద్ద హిట్టయినా సరే.. అక్కడి ప్రేక్షకులు కూడా డిజిటల్‌గా ఈ సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు.

ఈ చిత్రానికి విడుదల ముంగిట తీవ్ర ఇబ్బందులు తలెత్తి ఒక రోజు ఆలస్యంగా సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఆ సింపతీ సినిమాకు కలిసొచ్చిందని.. ఫ్యాన్ మూమెంట్స్, మాస్ అంశాలు, యాక్షన్ ఘట్టాలతో సినిమా గట్టెక్కేసిందని.. ప్రమాణాలు పడిపోయిన తమిళ సినిమాల్లో ఈ మాత్రం చిత్రం కూడా గగనం అయిపోయి ఈ సినిమా ఆడేసి ఉండొచ్చు తప్ప అంత పెద్ద హిట్టవ్వాల్సిన సినిమా కాదంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

This post was last modified on June 15, 2026 1:56 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

2 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

2 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago