Movie News

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్ల వేగం పెంచారు. పెద్ది ఎలాగూ స్లో అయిపోయింది కాబట్టి బాక్సాఫీస్ వద్ద దొరికిన అవకాశాన్ని వాడుకునేందుకు టీమ్ రెడీ అయ్యింది. పైగా జూన్ 26 రావాల్సిన లెనిన్ మళ్ళీ పోస్ట్ పోన్ కావడం వరంగా మారింది. పాజిటివ్ టాక్ వస్తే మా ఇంటి బంగారంకు పధ్నాలుగు రోజుల థియేటర్ రన్ దొరుకుతుంది.

అందుకే ఆడియన్స్ కి చేరువ అయ్యేందుకు సమంత ఎంత చేయాలో అంతా చేస్తోంది. నిన్న ఒక్క రోజే 40కి పైగా వీడియో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్కొక్కరికి పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే ఇచ్చినా ఎంత లేదన్నా సుమారు నాలుగైదు గంటలు కుర్చీలో కూచుని మాట్లాడుతూనే ఉండాలి. పక్కన వ్యక్తులు మారుతున్నారు కానీ సామ్ మాత్రం నవ్వు చెదరనివ్వకుండా అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది.

ఓపెనింగ్స్ రావడానికి సామ్ ఇమేజ్ కీలకం కానుంది. ఏదో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇస్తే మొదటి రోజు జనాన్ని రప్పించడం కొంచెం కష్టం కానీ యాక్షన్ టచ్ ఉన్న మాస్ ఎలిమెంట్స్ పెట్టడం వల్ల అన్ని వర్గాలను ఆకట్టుకుంటామనే ధీమా దర్శకురాలు నందిని రెడ్డిలో కనిపిస్తోంది. సామ్ భర్త రాజ్ నిడిమోరు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడంతో పాటు పబ్లిసిటీలో ప్రత్యక్షంగా భాగం పంచుకుంటూ తన వంతుగా వీలైనంత హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక సాంప్రదాయ ఇంటికి కోడలిగా వచ్చిన అమ్మాయి వెనుక రజనీకాంత్ బాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. తుపాకులు, కత్తులు పట్టుకుని శత్రవులను తెగనరికే రేంజ్ లో ఆమెకు సకల విద్యలు వచ్చి ఉంటాయి. అసలు ఆ ఊరు ఎందుకు వచ్చింది, ఆ సీక్రెట్ మిషన్ ఏంటనేది మా ఇంటి బంగారం స్టోరీ లైన్. పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని ఎలా ప్రెజెంట్ చేశారనే దాని మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. దీవానా, వంద దేవుళ్ళు, ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులతో మా ఇంటి బంగారం పోటీ ఉంది.

This post was last modified on June 15, 2026 2:41 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

10 minutes ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

3 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

5 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

5 hours ago