Movie News

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద పాజిటివ్ బజ్ ఏర్పడుతోంది. దర్శకుడు శివ నిర్వాణకు కమర్షియల్ సినిమాలు హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోయినా ఇన్ సైడ్ టాక్స్, ప్రీ రిలీజ్ రిపోర్ట్స్ సానుకూలంగా ఉండటంతో బిజినెస్ ఆఫర్లు బాగున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ కి ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుందనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ఉంది.

దీని తర్వాత రవితేజ దర్శకుడు హసిత్ గోలికి ఒక కమిట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ లైన్ ఓకే అయ్యిందని సమాచారం. ఫైనల్ వెర్షన్ సిద్ధమయ్యాక ప్రకటన రావొచ్చు. వీటి సంగతలా ఉంచితే తమిళ దర్శకుడు హరి చెప్పిన స్టోరీకి రవితేజ సానుకూలంగా స్పందించారనే ప్రచారం జోరుగా తిరుగుతోంది. హరి కలవడంలో ఆశ్చర్యం లేదు కానీ మాస్ రాజా చాలా క్యాలికులేటెడ్ గా ఉంటున్న నేపథ్యంలో హరి అంటే కొంచెం రిస్క్ అవుతుంది.

ఎందుకంటే ఈయన గత ట్రాక్ రికార్డు ఏమంత ఆశాజనకంగా లేదు. విశాల్ తో తీసిన రత్నం రెండు భాషల్లోనూ ఫ్లాప్. అంతకు ముందు అరుణ్ విజయ్ ఏనుగు కూడా అంతంత మాత్రంగానే ఆడింది. విక్రమ్ స్వామి స్క్వేర్ పనవ్వలేదు. సింగం 3 కూడా యావరేజే. మొదటి రెండు భాగాలు సక్సెస్ కొట్టాక మళ్ళీ ఆ స్థాయి విజయం అందుకోలేదు. అలాంటప్పుడు ఇప్పుడు వేరే భాషలో హిట్ ఇస్తారని అంత గుడ్డిగా నమ్మలేం. కథ విపరీతంగా ఎగ్జైట్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు.

అయినా మన హీరోలు ఫామ్ లో లేని కోలీవుడ్ డైరెక్టర్లతో జట్టు కట్టడం అంతగా కలిసి రాలేదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్, నాగ చైతన్య కస్టడీ, రామ్ ది వారియర్ అన్నీ అవే బాపతే. మరి రవితేజ రిస్క్ తీసుకుని హరికి ఓకే చెబితే మాత్రం షాక్ అవుతుంది. మాములుగా అయితే రవితేజ ఇలాంటి లెక్కలన్నీ వేసుకోరు. నెరేషన్, కాంబినేషన్ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ హరిది మాత్రం ప్రస్తుతానికి ప్రచారానికి పరిమితమయ్యింది కానీ ఇంకా అధికారిక ముద్ర పడలేదు.

This post was last modified on June 16, 2026 6:23 am

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

2 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

7 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

7 hours ago