Political News

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన భేటీలో అమరావతి రాజధాని నిర్మాణం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో సింగపూర్ ప్రధాని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజధానిలో విద్యాసంస్థలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న నిర్మాణాలపై ఆయన ఆసక్తి చూపినట్లు తెలిపింది.

అమరావతి నిర్మాణ ప్రగతిని వివరించిన సీఎం చంద్రబాబు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో అమరావతి నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యంతో పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తుల దిగుమతిపై పరిశీలించాలని సింగపూర్ ప్రధానిని కోరారు.

అనంతరం సీఎం చంద్రబాబు సింగపూర్ విదేశాంగ మంత్రి వివిన్బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కూడా అమరావతి రాజధాని అభివృద్ధి అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్‌లో సమృద్ధిగా ఉన్నాయని సీఎం వివరించారు.

తయారీ రంగంతో పాటు సేవల రంగంలోనూ రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో, సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయడానికి ఇరు పక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సమావేశాల్లో చర్చించినట్లు సమాచారం.

This post was last modified on June 15, 2026 9:19 pm

Share

Recent Posts

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

34 minutes ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

40 minutes ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

51 minutes ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

2 hours ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

2 hours ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

6 hours ago