అమరావతి రాజధాని ప్రాంతంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభ.. వేదికపై జరిగిన కొన్ని కీలక పరిణా మాలు చూస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్-ప్రధాని నరేంద్ర మోడీల మధ్య ఉన్న వ్యక్తగత బంధం ఎంత ద్రుఢంగా ఉందో అర్థమవుతుంది. వాస్తవానికి ప్రధాని జాతీయస్థాయిలో పట్టుమని 6-10 మంది నాయకులతోనే ఇలాంటి బంధాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో అయితే.. ఇలాంటి బంధం ఉన్న నాయకులే లేరు.
నేరుగా పేరు పెట్టి పిలవడం.. ఏకవచనంతో చొరవ తీసుకుని పలకరించడం వంటివి ప్రధాని డైరీలో చాలా చాలా తక్కువగానే ఉంటాయి. దీనికి కారణం.. ఎప్పుడు ఎలాంటి రాజకీయాలను చూడాల్సి వస్తుందో అన్న వ్యవహారం మోడీకి బాగా తెలుసు. అందుకే.. ఎవరితోనూ పెద్దగా మానసిక సంబంధం పెట్టుకోరు. కానీ.. దేశవ్యాప్తంగా ఆరుగురి నుంచి 10 మంది వరకు నాయకులతో మోడీ అవ్యాజమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో అమిత్ షా, జేపీ నడ్డా వంటి సొంత పార్టీ నాయకులు ఉన్నారు.
ఇతర పార్టీలకు చెందిన వారిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందున్నారని చెప్పాలి. తాజా పరిణామాలు.. దీనిని రుజువు చేస్తున్నాయి. జనసేనాని దగ్గు, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారని తెలిసి.. ఆయనకు కాఫ్ టాబ్లెట్/ చాక్లెట్ అందించడం.. సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. ఇది వారి మధ్య ఉన్న బంధాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు.. పేరు పెట్టి.. చేయి చూపి మరీ పిలుస్తూ.. తన దగ్గరకు రమ్మనడం.. కూడా పవన్-మోడీ ల వ్యక్తిగత బంధాన్ని చాటుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇలా .. సాధారణంగా ప్రధాని మోడీ చేయరు. ఎంతో స్నేహం.. అంతకు మించి సదరు నేతపై అంతకు మించిన విశ్వాసం ఉంటే తప్ప.. ఆయన అలా వ్యవహరించరు. ఇది పవన్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు మించి మరెవరూ ఇలా మోడీ దగ్గర మార్కులు వేయించుకున్న పరిస్థితి లేదు. గతంలో వైసీపీ అధినేత జగన్‌ను.. మోడీకి దత్తపుత్రుడు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినా.. ఆ తరహా పరిస్థితి బహిరంగ వేదికపై ఎక్కడా జరగలేదు.
అయితే.. పవన్ విషయంలో ఫెవికాల్‌ను మించిన బంధంతో మోడీ వ్యవహరించారని.. అంటున్నారు. ఆయన అనుసరిస్తున్న సనాతన ధర్మం కావొచ్చు.. కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు పవన్ మద్దతు తెలపడం కావొచ్చు. తమిళనాడులోని ప్రభుత్వంపై పరోక్ష యుద్ధం చేస్తున్న తీరు వంటివి.. మోడీని మెస్మరైజ్ చేస్తుండడమే దీనికి కారణాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
This post was last modified on May 3, 2025 3:59 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…