ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి వారం ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. ఆ తర్వాతి వారమేమో ఒక్కటే సినిమా వచ్చింది. కానీ ఫిబ్రవరి తొలి వారంలో మాత్రం ఒకేసారి చాలా సినిమాలు వచ్చి పడిపోతున్నాయి బాక్సాఫీస్ మీద.
మామూలుగా ఫిబ్రవరి అంటేనే చిన్న సినిమాల క్లియరెన్స్‌కు వేదికగా నిలుస్తుంటుంది. సంక్రాంతి సీజన్‌కు, వేసవికి మధ్యలో ఇది అన్ సీజన్ కావడంతో చిన్న చిత్రాలను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తుంటారు. ఈ సారి కూడా అందుకు మినహాయింపేమీ కాదు.
కానీ ఈ వీకెండ్లో ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. కానీ ఈ సినిమాకు బజ్ మాత్రం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఉన్నంతలో గుణశేఖర్ మూవీ యుఫోరియా చెప్పుకోదగ్గ సినిమా. కానీ స్టార్ టచ్ లేకపోవడం వల్ల దీనికీ హైప్ లేదు. గుణశేఖర్ పేరు మీదే సినిమా ఆడాల్సి ఉంది. ఒకప్పటి బాల నటి, దురంధర్‌తో కథానాయికగా మారిన సారా అర్జున్ ఆకర్షణ ఈ చిత్రానికి ఎంతమేర ఉపయోగపడుతుందో చూవాలి.
దీంతో పాటు నబతన్ చంద్ర మూవీ హనీ రిలీజవుతోంది. ఆ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి ఇప్పుడే తెలిసింది. యాటిట్యూడ్ స్టార్ మరోసారి బరాబర్ ప్రేమిస్తా తో వస్తున్నాడు.
ఇంకా శ్రీ చిదంబరం గారు, ఎర్రచీర, ఆపరేషన్ పద్మ, బ్లడ్ రోజెస్, ఘార్గా, లగ్గం టైమ్ లాంటి చిన్న సినిమాలు చాలానే రేసులో ఉన్నాయి. వీటికి తోడు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా తీసిన అభిషాన్ జీవింత్, మలయాళ సెన్సేషన్ అనస్వర రాజన్ జంటగా రూపొందిన తమిళ అనువాదం విత్ లవ్ కూడా ఈ వారమే బరిలోకి దిగుతోంది. ఇవి కాక ఆరెంజ్, సలార్, 3 చిత్రాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇలా మొత్తం డజనుకు పైగా సిపనిమాలు పోటీలో ఉన్నాయి. ఇన్ని సినిమాల్లో ఏది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి మరి.
This post was last modified on February 1, 2026 11:13 pm
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…