అధికారం పోయి.. పదిమాసాలు దాటిపోయినా.. వైసీపీలో ఊపు, ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. నాడు యాక్టివ్‌గా ఉన్నవారే.. నేడు అసలు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం.. వైసీపీ గురించి మాట్లాడు కునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు.. ఏ ఇద్దరు కనిపించినా.. వైసీపీ గురించి.. జగన్ గురిం చిన చర్చ చేసేవారు. అదేసమయంలో నాయకుల దూకుడు.. మంత్రులు బూతుల గురించి కూడా.. చర్చ లు జరిగాయి.
అయితే.. ఒక్కసారి అధికారిపోయిన తర్వాత.. వైసీపీ పాత్ర గురించి ఎక్కడా చర్చకు రావడం లేదు. ఎవ రూ పట్టించుకోవడమూ లేదు. ఈ విషయాన్ని స్వయంగా జగనే చెప్పడం గమనార్హం. తాజాగా ఆయన రాయల సీమ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. గమనిస్తే.. వైసీపీ పుంజుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదన్న భావన వ్యక్తమవుతోంది. ఏందబ్బా.. మన గురించి ఎక్కడా వినిపించడం లేదు. మీరు ఏం చేస్తున్నారు అని ఒకప్పుడు యాక్టివ్‌గా ఉన్నవారిని జగన్ ప్రశ్నించారు.
అంతేకాదు.. తాను స్వయంగా వస్తే తప్ప.. ఎవరూ పుంజుకోరా? అని కూడా జగన్ ప్రశ్నించడం గమనార్హం. దీనిని బట్టి.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఒకప్పుడు కావాలి జగన్.. రావాలి జగన్.. అని పాడిన నాయకులు.. ఇప్పుడు మౌనంగా ఉన్నారు. వీరి పేర్లుపెట్టి మరీ జగన్ గుర్తు చేయాల్సి వచ్చింది. అంటే.. పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ఇక, రాజకీయాల్లో గెలుపు ఓటములను పక్కన పెడితే.. వైసీపీలో ఇంత నైరాశ్యానికి కారణం.. చాలా నే ఉందని అంటున్నారు.
ప్రజల్లో ఉన్నవారిని పట్టించుకోకపోవడం.. ఎప్పటి నుంచో ఉన్న కారణమైతే.. ఇప్పుడు పనిచేసినా.. గుర్తిం పు ఉంటుందో ఉండదన్న భావన నాయకుల్లో ఉంటోంది. సడెన్‌గా నియోజకవర్గాలను మార్చేసి.. కొత్తవారి కి అవకాశం ఇవ్వడం.. బలమైన బ్యాక్ డ్రాప్‌గా చెబుతున్నారు. నిర్దేశిత నాయకులను కూడా.. తక్కువ చేసి చూడడం ఇబ్బంది కలిగిస్తున్న పరిణామం. దీంతో వైసీపీలో నాయకులు బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ముందుగా ఈ వాదనను జగన్ ఖండించి.. నాయకుల్లో స్థయిర్యం నింపే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates