Political News

లోకేష్ టీంకు చాలానే ప‌ని ప‌డిందా..?

లోకేష్ టీంకు చాలానే పని పడిందా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న స్వల్ప గ్యాప్ ను తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందా? అంటే అవుననే అంటున్నాయి టిడిపి వర్గాలు. వాస్తవానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ప్రజల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాలని వారికి వివరించాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు నాయకులు కుమ్ములాటలు పక్కన పెట్టి ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఆయన హిత‌వు పలుకుతున్నారు.

అయినప్పటికీ చాలామంది నాయకులు ఈ పనిని వదిలేసి తమ సొంత వ్యవహారాలు చూసుకుంటున్నా రు. ఇప్పటికే అనేకసార్లు చంద్రబాబు హెచ్చరించినప్పటికీ దాదాపు పది జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని నారా లోకేష్ కు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో చూస్తూ ఊరుకుంటే సమస్యలు మరింత పెరుగుతాయని భావించిన‌ నారా లోకేష్ తన టీమును రంగంలోకి దింపేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కూడా నారా లోకేష్ టీం చాలా బాగా పనిచేసిన విషయం తెలిసిందే.

ఆయన పాదయాత్ర చేసినప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండి పాదయాత్రను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అదే విధంగా మంత్రి అయిన తర్వాత కూడా ఆయన దైనందిన కార్యక్రమాలతో పాటు ప్రజలకు చేరువవుతున్న విషయాలను కూడా సమగ్రంగా వివరించడంలో నారా లోకేష్ టీం అద్భుతమై న మార్పులు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేరుగా ప్రభుత్వ కార్యక్రమాలను కూడా వారికి అప్పజెప్పాలని ఉద్దేశం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.

తద్వారా వైసిపి చేసే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వేయడం అదేవిధంగా చంద్రబాబు చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించటం వంటి కీలకమైన బాధ్యతలను వారికి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా సభ్యత్వాలు ఉన్న టిడిపిలో ఇప్పు డు జిల్లాల వారీగా నారా లోకేష్ టీమ్లను కొత్తగా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇదే జరిగితే నాయకుల కంటే కూడా నారా లోకేష్ టీం బాగా పనిచేస్తుందని తద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.

This post was last modified on April 24, 2025 8:42 am

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

1 hour ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

6 hours ago