నాయకులన్నాక.. ప్రజల మధ్య చర్చ ఉంటుంది. వారిచ్చే మార్కులు కూడా అవసరం. ఒకప్పుడు నాయ కులు.. ప్రజల ఆలోచనలు వేరేగా ఉండేవి. ఎన్నికలకు ఏడాది ముందు నాయకులకు ప్రజల్లో మార్కులు ఎలా ఉన్నాయనే చర్చ ఉండేది. పార్టీలు కూడా..ఎన్నికలకు ముందు అప్రమత్తం అయ్యేవి. కానీ.. ఇప్పుడు అలా కాదు. ఎన్నికలకు కనీసం మూడేళ్ల నుంచే పార్టీలు, నాయకులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజల్లో తమ గ్రాఫ్ పడిపోకుండా పెంచుకునే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
గత టీడీపీ అయినా.. ప్రస్తుత తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అయినా.. ఈ గ్రాఫ్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాయి. సమస్యల మాట ఎలా ఉన్నా.. తాము సమస్యల్లో చిక్కుకోకుండా.. జాగ్రత్తలు పడ్డాయి. ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే టీడీపీ అలెర్ట్ అయింది. ఇక, బీఆర్ ఎస్ పార్టీ అయితే.. నాలుగేళ్ల ముందే అలెర్ట్ అవుతూ.. ప్రజల మధ్యకు వచ్చింది. మరి ఇలా చూసుకుంటే.. వైసీపీ అధినేత.. జగన్.. ఆయన పార్టీ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నాయి?
ఇప్పటికి ఏపీలో ఎన్నికలు ముగిసి ఏడాది అయింది. మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు. అలాగని కూర్చుంటే.. నాయకుల గ్రాఫ్ పరిస్తితి దారుణంగా ఉండే అవకాశం ఉంది. దీనిని దృస్టిలో పెట్టుకునే.. సీఎం చంద్రబాబు తరచుగా తనను తాను పరీక్షించుకుంటున్నారు. తన పాలనను పరిశీలించుకుంటు న్నారు. తద్వారా ప్రజల్లో తన ఇమేజ్ దెబ్బతినకుండా.. గ్రాఫ్ పడిపోకుండా కూడా. . ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల మధ్య ఉంటున్నారు.
కానీ.. వైసీపీ అధినేత జగన్ మాత్రం.. ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఈ గ్రాఫ్‌లు.. లెక్కలు వేసుకోవడం లేదు. అంతా..ఎన్నికలకు ముందు చూసుకుందాం.. అనుకున్నారో ఏమో.. తెలియదు.. కానీ, ప్రజలను పూర్తిగా పక్కన పెట్టారు. దీంతో ఇప్పుడు గ్రాఫ్ ఢమాల్‌న పడిపోయిందన్న చర్చ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. చంద్రబాబు ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతుండగా.. జగన్ ఇమేజ్ అంతకు రెండింతల స్థాయిలో తగ్గుతూ వస్తోంది.
ప్రస్తుతం జగన్‌కు 10 శాతం మేరకు మాత్రమే పాజిటివిటీ ఉందని తెలుస్తోంది. చంద్రబాబుకు ఎన్నికలకు ముందున్న 80 శాతం పాజిటివిటీ.. కొంత తగ్గుతూ.. మరింత పెరుగుతూ.. 80 శాతం దగ్గర నిలకడగా ఉందన్న చర్చ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ అలెర్ట్ కాకపోతే.. ఎన్నికల సమయానికి మరింత పడిపోయే అవకాశం ఉందని పార్టీ నాయకులు గుసగుస లాడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates