వైసీపీ నుంచి బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు.. టీడీపీలో చేరి.. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఉండినియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం కూడా దక్కించుకున్నారు. అయితే.. అసలు వైసీపీ నుంచి ఆయన బయటకు ఎందుకు వచ్చారన్న విషయంపై ఇప్పటికీ అనేక చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. రఘురామ ఎంపీగా ఉన్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. తర్వాత రివర్స్ అయ్యారు. నిరంతరం.. జగన్‌పై ఎద్దేవా చేస్తూ.. వ్యాఖ్యలు సంధించారు.
అయితే.. ఇలా యూటర్న్ తీసుకున్న నాయకులు ఉన్నారు కానీ.. ఇంతగా తమ తమ పార్టీల నాయకులను ఏకేసిన నాయకులు మాత్రం పెద్దగా కనిపించరు. టీడీపీని వదిలి కూడా చాలా మంది రాజకీయాల్లో ప్లేటు మార్చారు. అయినా.. వారిలో చాలా చాలా తక్కువ మంది మాత్రమే చంద్రబాబును విమర్శించారు. రఘురామ అలాకాదు.. ఇటు రాజకీయంగా అటు.. వ్యక్తిగతంగా జగన్‌పై బెయిల్ రద్దు కోరుతు పిటిషన్లు వేసే వరకు వచ్చారు.
అయితే.. ఇంతలా జగన్‌ను వ్యతిరేకించే విషయంపై అనేక విషయాలు తాజాగా వెలుగు చూశాయి. మంత్రి సుభాష్‌చెప్పిన దాని ప్రకారం.. జగన్… ఆయనను సర్ అని సంబోధించమన్నారని తెలుస్తోంది. వాస్తవానికి జగన్ కంటే రఘురామ వయసులో పెద్దవాడు. అయినా.. సర్ అనే సంబోధించినా.. తన ఫొటోతోనే.. నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలని షరతు పెట్టడం.. తన వల్లే గెలిచానని చెప్పమనడంతో రఘురామ వ్యతిరేకించారని తెలుస్తోంది.
మరోవైపు.. రఘురామే స్వయంగా చెప్పిన మరో విషయం కూడా ఉంది. తాను మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు అంటే అభిమానిస్తానని.. అయితే.. ఆయనను జగన్ ఆయన చుట్టూ ఉన్న కోటరీ.. తీవ్రంగా విమర్శించేవారని.. దీనిని తట్టుకోలేక విభేదించి బయటకు వచ్చినట్టు చెప్పారు. కానీ.. దీనికన్నా.. జగన్.. ఆయనను సర్ అంటూ.. పిలవాలని ఒత్తిడి చేయడం.. నమస్కారాలు పెట్టాలని సూచించడం వంటివే నచ్చక రఘురామ వచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. రఘురామ వర్సెస్ జగన్‌మధ్య విభేదాల విషయంలో చాలానే ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది.
This post was last modified on April 21, 2025 7:24 pm
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…