బీజేపీకి నోట్ల విప్ల‌వం.. ఒక్క ఏడాదే 2 వేల కోట్ల పైమాటే!

ప్ర‌ధాని మోడీని చూశారో.. లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని చూశారో తెలియ‌దు కానీ.. కార్పొరేట్ దిగ్గ‌జాలు.. బీజేపీపై విరాళాల వ‌ర్షం కురిపించారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 2,243 కోట్ల రూపాల మేరకు విరాళాలు అందించారు. అన్ని జాతీయ పార్టీలకు కలిపి అందిన విరాళాల్లో 88 శాతం నిధులు ఒక్క బీజేపీకే అందాయంటే.. వారు భ‌య‌ప‌డుతున్నారో.. లేక‌.. ఉదార‌త చూపిస్తున్నారో అర్థ‌మ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంగా 8,358 మంది నుంచి రూ.2.243 కోట్ల విరాళాలు బీజేపీకి లభించాయి. వీరిలో 3,478 మంది కార్పొరేట్ దిగ్గజాలు, వ్యాపార వేత్తలే ఉండడం గమనార్హం.

మ‌రో జాతీయ పార్టీ కాంగ్రెస్ విషయానికి వస్తే రూ.281.48 కోట్లు విరాళాల రూపంలో సమకూరాయి. ఈ పార్టీకి 1,994 మంది విరాళాలు అందించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో వెల్లడించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదికలో రూ.20 వేలకు మించి ఇచ్చిన విరాళాలను ప్రధానంగా ప్రస్తావించింది.

‘కార్పొరేట్’ కాసుల వర్షం
బీజేపీకి కార్పొరేట్ సంస్థల నుంచి కాసుల వర్షం కురిసింది. ప్రడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.723,675 కోట్లు విరాళంగా ఇచ్చింది. కాంగ్రెస్ కు రూ.158 కోట్లు అందించింది. టైమ్స్ ఎలక్టోరల్ ట్రస్ట్ బీజేపీకి నాలుగు సార్లుగా రూ.127.5 కోట్లు ఇచ్చింది. డెరైన్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ రూ.50 కోట్లు కమలం ఖాతాలో వేసింది. కాంగ్రెస్‌కు రూ.3.2 కోట్లు ఇచ్చింది. ఆక్మే సోలార్ ఎనర్జీ సంస్థ 51 కోట్లు, భారత్ బయోటెక్ రూ.50 కోట్లు, రుంగా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.50 కోట్లు, దినేశ్ చంద్ర ఆర్. అగర్వాల్ ఇన్ఫ్రా రూ.30 కోట్లు బీజేపీకి సమర్పించాయి.

మ‌రిన్ని వివ‌రాలు..

  • జాతీయ పార్టీలకు మొత్తం రూ.2544.28 కోట్లు విరాళాలుగా అందాయి.
  • 2022-28 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే.. 199 శాతం అదనంగా విరాళాలు వచ్చాయి.
  • ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలకు స్వల్పంగానే విరాళాలు దక్కాయి.
    2028-24 ఆర్థిక సంవత్సరంలో ఆపకు రూ.26.008 కోట్ల మేరకు (7018%) తగ్గాయి.
  • 2028-24లో నేషనల్ పీపుల్స్ పార్టీకి రూ.7.331 కోట్ల మేరకు (88.02%) కోత పడింది.
  • గత 18 ఏళ్లలో బీఎస్పీకి రూ.20 వేలకు పైగా ఏ ఒక్కరూ విరాళం ఇవ్వలేదు.
  • జాతీయ పార్టీలకు 3,755 కార్పొరేట్ సంస్థల అధిపతులు, వ్యాపార వేత్తలు విరాళాలు ఇచ్చారు.
  • కార్పొరేట్ సంస్థల అధిపతులు, వ్యాపార వేత్తలు ఇచ్చిన విరాళాలే రూ.2.362.55 కోట్లు.
  • బీజేపీకి వ్యక్తిగతంగా 4,628 మంది ఇచ్చిన విరాళాల మొత్తం రూ.169.126 కోట్లు మాత్రమే.