ఎన్టీఆర్ జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం పేరు చెబితె వెంటనే గుర్తుకు వచ్చే పేరు కొడాలి నానీ. ఆయ న అసలు ఏదున్నా.. ఆయన మాత్రం నానీ పేరుతోనే ఫేమస్ అయ్యారు. అయితే.. ఒక్క ఓటమి నాయ కులను కుంగదీయకపోవచ్చు. వారి పేరును కూడా భూస్థాపితం చేయకపోవచ్చు. కానీ, ఒక అభివృద్ధి.. ఒక సంక్షేమం.. ప్రజలను ఆకట్టుకునే నాయకుడు. వారిని అక్కున చేర్చుకునే నాయకుడు ఉంటే మాత్రం ఎంత పేరెన్నికగన్న నాయకుడైనా.. తెరమరుగు కావాల్సిందే.
ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో అచ్చంగా అలాంటి ఘటనే చోటు చేసుకుంటోంది. గత ఏడాది జరిగి న ఎన్నికల్లో ఎన్నారై టీడీపీ నాయకుడు వెనిగండ్ల రాము.. గుడివాడలో విజయం దక్కించుకున్నారు. అయితే.. దీనికి ముందు ఆయన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ఆయన అనేక సమస్యలు చూశా రు. అనేక మంది సమస్యలు కూడా విన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత.. వరుస పెట్టి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా భారీ ప్రాజెక్టుకు కూడా వెనిగండ్ల శ్రీకారం చుట్టారు.
కీలకమైన గుడ్లవల్లేరు – ముదినేపల్లి రహదారి నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు చేయించారు. నియో జకవర్గంలో దశాబ్దాలుగా అపరిస్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే రాము.. గుడివాడ పట్టణం బైపాస్ రోడ్డు, ముదినేపల్లి – గుడ్లవల్లేరు రహదారుల అభివృద్ధికి ఐదు కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నారు. అంతేకాదు.. గత పది నెలల సమయంలోనే గుడివాడలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఇటీవల రూ.21.93 కోట్లతో.. 57.98 కిలోమీటర్ల మేర సిసి రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఇది వైసీపీ హయాంలోనే వేయాలని అనేక మంది డిమాండ్ చేసినా.. అప్పటి ఎమ్మెల్యే నాని పట్టించుకోలేదు. కానీ, రాము ఎమ్మెల్యే అయిన తర్వాత.. పలు మార్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసి నియోజక వర్గంలో రహదారుల దుస్థతిని వారికి వివరించారు. ఫలితంగా ఇప్పుడు నియోజకవర్గంలో ఎటు చూసినా.. అద్దంలా మెరిసిపోతున్న రహదారులు దర్శనమిస్తున్నాయి. దీంతో నాని పేరును దాదాపు మరిచిపోయే పరిస్తితి రాజకీయంగా వచ్చిందని టీడీపీనేతలు చెబుతున్నారు.