ఏపీలో కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు.. గత వారం రోజులుగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు . అయితే.. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనా కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024ను వారు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తద్వారా.. ముస్లింల హక్కులపై దాడి చేస్తున్నారని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. కాగా.. ఈ వ్యవహారాన్ని కేంద్రం రాష్ట్రాల నెత్తిపై పెట్టింది.
కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును రాష్ట్రాల్లో ఆమోదించి పంపిస్తే.. దానిని కేంద్రం ఆమోదించి మెజారిటీ రాష్ట్రాల అభిప్రాయం మేరకు.. నిర్ణయం ప్రకటించనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ.. తీర్మానాలు చేశాయి. అయితే.. ఏపీ విషయానికి వస్తే మాత్రం దీనిపై సందిగ్ధత కొనసాగుతోంది. సీఎం, డిప్యూటీ సీఎం సహా.. మంత్రులు ఎవరూ కూడా ఈ బిల్లుపై ఎలాంటి నిర్నయం తీసుకుంటామన్నది చెప్పడం లేదు.
ఈ నేపథ్యంలోనే ముస్లిం సామాజిక వర్గం నుంచి సర్కారు పై విమర్శలు, నిరసనలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం రంజాన్‌ను పురస్కరించుకుని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. అయితే.. దీనిని బాయ్ కాట్ చేస్తున్నట్టు ఏపీ ముస్లిం, మౌజన్ల సంఘాలు ప్రకటించాయి. టీడీపీ అనుకూల ముస్లింలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడం గమనార్హం.
తాజాగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు, విజయవాడ, గుంటూరు, అనంతపురం జిల్లాలో ముస్లింలు రోడ్డెక్కారు. తమకు అన్యాయం చేసే వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలని.. దీనికి ఆమోదం తెలపొద్దని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ.. నినాదాలు చేశారు. మరి ఇప్పటికైనా టీడీపీ, జనసేనలు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తాయో లేదో చూడాలి.
This post was last modified on March 31, 2025 1:19 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణిగానే నిన్నటిదాకా కొనసాగిన నారా భువనేశ్వరి ఇప్పుడు సరికొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారని…
టీడీపీ సీనియర్ నాయకుడు, దెందులూరు ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న చింతమనేని ప్రభాకర్.. తన చెయ్యి పెద్దదని…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేకెత్తించి.. అనేక అనుమానాలను కూడా సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి వ్యవహారంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. కాకాణి సొంత…
స్టాండప్ కామెడీ నవ్వు తెప్పించడం సంగతేమో గానీ... కట్టుబాట్లను మాత్రం చాలా సునాయసంగా దాటేస్తోంది. భారత సమాజం గుట్టుగా ఉంచే కార్యకలాపాలను…
వారంతా చిన్న చితకా కాంట్రాక్టర్లు. చిన్నపాటి పనులు చేసుకుని తమ జీవితాలను, తమపై ఆధారపడిన కూలీల జీవితాలను నడిపిస్తున్నారు. వీరంతా…