ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని పేదలకు ఆర్థిక సహాయం అందించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు.. 3 వేల మందికి పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సొమ్ములు అందించే ఫైలుపై ఆయన ఉగాది సందర్భంగా తొలి సంతకం చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఉగాదిని పురస్కరించుకుని పేదలకు మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇదే తొలిసారి అని సీఎం పేర్కొన్నారు. మొత్తంగా 38 కోట్ల రూపాయలకు పైగానే.. సొమ్మును పేదలకు అందించే సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబం ధించి సీఎం సంతకం చేశారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల కు చెందిన పేదలకు ఈ ఫండ్స్ ద్వారా మేలు జరగనుందని.. ఆపద, అనారోగ్యం, ఇతర సమస్యలలో ఉన్న వారికి ఈ నిధులు ఎంతగానో దోహద పడతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
38 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసేలా అధికారులను కూడా ఆదేశించినట్టు సీఎం చంద్రబా బు పేర్కొన్నారు. 3456 మందికి ఈ నిధులను అందించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా పేదల భవిష్య త్తును బంగారు మయం చేసే పీ-4 కార్యక్రమానికి కూడా ఉగాది సందర్భంగానే శ్రీకారం చుడుతున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల మందికిపైగా పేదలు పేదరికం నుంచి బయటపడతారని.. తద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన యజ్ఞం సాకారం అవుతుందని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates