సోషల్ మీడియాలో ఇప్పుడంతా గిబ్బీ ట్రెండ్స్ నడుస్తోంది కదా. జపాన్ కు చెందిన యానిమేషన్ స్టూడియో ఒరవడిని అందిపుచ్చుకుని… ఆ స్టూడియో చిత్రాల మాదిరిగానే యానిమేషన్ చిత్రాలను పోస్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ గా మారిపోయింది. దాదాపుగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ గిబ్లీ ట్రెండ్స్ న ఫాలో అవుతూ గిబ్లీఫైడ్ ప్రపంచంలో ఎంట్రీ ఇస్తూ తమదైన శైలిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చిత్రాలు కూడా సదరు ప్రముఖులు అనుచరులు, ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు తనను తాను అప్ డేట్ చేసుకోవడమే కాకుండా… ఆ టెక్నాలజీని తన వారికి అందించడమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా శుక్రవారం ఈ గిబ్లీ ట్రెండ్స్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ గిబ్లీఫైడ్ ఆదారంగా రూపొందించిన మూడు చిత్రాలతో ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఇందలో తొలి ఫొటోను ఎన్డీఏ గ్రూప్ ఫొటోను పెట్టిన బాబు..రెండో ఫొటోను తన ఫ్యామిలీ ఫొటోను పెట్టారు. మూడో ఫొటోను మాత్రం ప్రజలకు సేవ చేస్తున్న తన ఫొటోను బాబు పోస్ట్ చేసి తన ప్రత్యేకతను చాటకున్నారు.
ఇక చంద్రబాబు కంటే కాస్త చురుగ్గా కదులుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా తన తండ్రి కంటే కాస్తంత ముందుగానే ఈ గిబ్లీఫైడ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. లోకేశ్ కూడా మూడు ఫొటోలతో తన గిబ్లీ ట్రెండ్స్ ను ప్రారంభించగా… తొలి ఫొటోను భార్య, కుమారుడితో కలిసి ఉన్న ఫొటోను ఎంచుకున్నారు. ఇక రెండు, మూడో ఫొటోలను టీడీపీ శ్రేణలతో తీసుకున్న ఫొటోలతో సర్దేశారు. అటు చంద్రబాబుతో పాటు ఇటు లోకేశ్ కూడా ఒకే రోజు కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇలా గిబ్లీ ట్రెండ్స్ లో చేరడం టీడీపీ శ్రేణులను అమితంగా ఆకట్టుకుంది. చంద్రబాబు తన గిబ్లీ ట్రెండ్స్ తొలి ఫొటోలో తనతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, జనసేనాని పవన్ కల్యాణ్ ల ఫొటోలను తన ఫొటోతో సరిసమానంగా చిత్రీకించిన వైనం మరింతగా ఆకట్టుకుంది.