ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలానే.. ఇక నుంచి మార్చి 19వ తేదీని ఏపీ ప్రజలు, ప్రభు త్వాలు కూడా మరిచిపోలేని విధంగా సీఎం చంద్రబాబు మార్చనున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో చేయలేని పనిని ఆయన బుధవారం సాధించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చంద్రబాబు ఏపీకి సంబంధించిన పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇవి సాదా సీదా ఒప్పందాలు అయితే కాదు.
ప్రధానంగా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత టెక్నాల జీని రాష్ట్రంలో విస్తృత పరిచే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర బృందం ఒప్పందం చేసుకోనుంది. ఇది రాష్ట్ర చరిత్ర గతిని భవిష్యత్తులో మార్చేయడం ఖాయమని ఐటీ నిపుణులు చెబుతు న్నారు. అంతేకాదు.. ప్రపంచ దేశాలు సైతం ఏపీవైపు చూసే విధంగాఈ మార్పు ఉంటుందని అంటున్నా రు. దీనితోపాటు.. డేటా కేంద్రాల ఏర్పాటు, ఐటీ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులపై కూడా.. గేట్స్‌తో ఒప్పందాలు చేసుకుంటారు.
అలానే.. నైపుణ్య శిక్షణలో కీలకమైన ఏఐ, ఐటీ రంగాల్లోనూ బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, అనంతపురం, విశాఖల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుపైనా ఒప్పందాలు జరగనున్నాయి. కృత్రిమ మేథ కు సంబంధించిన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం తలపోస్తున్న నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీ ట వేస్తుండడం గమనార్హం.
తద్వారా రాష్ట్ర ఆదాయం పెరగడంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత రెట్టింపు కానున్నాయి. సాధారణంగా ఒక పెట్టుబడి రావడం, ఒక పరిశ్రమ రావడం వేరు. కానీ, ఐటీకి సంబంధించి , ముఖ్యంగా ఏఐకి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడులు సాధిస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందు వరుసలో నిలవ నుంది. సో.. బిల్‌గేట్స్‌తో ఒప్పందాలు.. రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనున్నాయి. బుధవారం మధ్యాహ్నం.. సీఎం చంద్రబాబు ఢిల్లీలో గేట్స్‌తో జరిగే సమావేశంలో కీలకమైన ఒప్పందాలకు శ్రీకారం చుట్టనున్నారు.