లేడీ అమితాబ్‌గా తెలుగు చిత్ర సీమలో ఒక దశాబ్దాన్ని తన సొంతం చేసుకున్న హీరోయిన్… విజయ శాంతి ఉరఫ్.. రాములమ్మ. సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి తరం హీరోయిన్లలో విజయశాంతి ఒక్కరే మనకు కనిపిస్తారు. విజయశాంతి తరంలో రాధ, రాధిక, భానుప్రియ, శోభన, సుహా సిని వంటి వారు హీరోయిన్లుగా రాణించినా.. రాజకీయాల వైపు మాత్రం రాలేదు. వేరే వేరే రంగాలను ఎంచుకున్నారు. విజయశాంతి మాత్రం కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలోనే రాజకీయాల వైపు అడుగులు వేశారు.
1998లోనే విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లోనే ఆమె బీజేపీలో చేరి.. పార్టీ మహిళా విభాగం.. మహిళా మోర్చాకు కార్యదర్శిగా పనిచేశారు. ఆమె నెల్లూరులో నిర్వహించిన తొలి రాజకీయ సభకు పెద్ద ఎత్తున స్పందన రావడం గమనార్హం. ఇది ఆమెను రాజకీయాల్లో నిలిచిపోయేలా ప్రేరణ కలిగించింది. ఇక, ఆ తర్వాత ఏడాది వచ్చిన సార్వత్రిక సమరంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు.. సోనియా గాంధీపై బీజేపీ అభ్యర్థిగా నిలిచి.. సోనియానే ఓడిస్తానని సవాల్ చేసే వరకు వచ్చింది. అప్పట్లో సోనియా కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. దీంతో బీజేపీ కడప ఎంపీ టికెట్‌ను విజయశాంతికి ఖరారు చేసింది.
అయితే, చివరి నిముషంలో సోనియా తన కడప ప్రతిపాదనను విరమించుకుని యూపీలోని రాయ్‌బరేలి నియోజకవర్గాన్ని ఎంచుకోవడంతో విజయశాంతి కూడా విరమించుకున్నారు. అదేసమయంలో తమిళనాడులో జయలలిత పార్టీ అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు.అదేవిధంగా బీజేపీకి కూడా ప్రచారం చేసిపెట్టారు. ఇలా ఆమె రాజకీయ జీవితం సాగుతున్న క్రమంలోనే తెలంగాణ ఉద్యమం తెరమీదికి వచ్చింది. దీంతో సొంతంగా పార్టీ పెట్టాలని భావించి తల్లి తెలంగాణ పేరుతో పార్టీని స్థాపించారు. 2009, జనవరిలో పార్టీని స్థాపించినా.. విజయశాంతికి ఆశించిన మద్దతు లభించలేక పోయింది.
దీంతో అదే ఏడాది జూన్‌లో పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి కేసీఆర్ చెల్లిగా ప్రాచుర్యం పొందారు. ఆ ఎన్నికల్లోనే ఆమె టీఆర్ఎస్ తరఫున మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. కేసీఆర్‌తోపాటు ఆమె తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేసి.. తెలంగాణ బిడ్డగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమె ఫార్మాట్‌లో రాజీనామా ఇవ్వలేదన్న కారణంగా రిజైన్ లెటర్ తిరస్కరించారు. ఇక, ఆ తర్వాత .. కేసీఆర్ తో విభేదించి రాజకీయాలకు కొన్నాళ్లకు దూరంగా ఉన్నారు. 2014లో మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మెదక్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినా.. విజయం సాధించలేక పోయారు. 2018 ఎన్నికల్లో టికెట్ ఆశించినా.. దక్కలేదు. అయితే, పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని ఆమె గట్టి డిమాండ్ తెరమీదికి తెచ్చారు. కానీ, దక్కలేదు. దీంతో అలకబూనిన విజయశాంతి.. ఇప్పుడు మళ్లీ పాత పార్టీ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఆమె త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు వస్తున్నాయి. సరే! ఈ మొత్తం ఎపిసోడ్‌లో విజయశాంతి ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండలేక పోవడం గమనార్హం. దీనికి కారణం ఏంటి?
ఎందుకు రాజకీయంగా ఒకదశలో పుంజుకున్నా.. తర్వాత డౌన్ అయ్యారు? అనేవి కీలక ప్రశ్నలు.. దీనికి కారణం.. ఎవరినీ లెక్కచేయకపోవడం, తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం. రాజకీయాలలో ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు. స్థానిక నేతలను కలుపుకొని పోవాల్సిన అవసరాన్ని విజయశాంతి గుర్తించలేకపోతున్నారనే వాదన ఉంది. ఇప్పుడు బీజేపీలో చేరినా.. అదే పరిస్థితి పునరావృతం అవుతుందనేది పరిశీలకుల భావన. ఏదేమైనా.. తడబాట్లు కొనసాగితే.. విజయశాంతి రాజకీయం ఇలానే ఉంటుంది తప్ప.. మెచ్చదగ్గరీతిలో ఉండదనేది ప్రధాన సూచన. మరి ఆమె తనను తాను మార్చుకుంటారో లేదో చూడాలి.
This post was last modified on October 28, 2020 5:37 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…