ఏపీలో కీలక ప్రాంతమైన గుంటూరు నగర పాలక సంస్థలో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు మేయర్ గా కొనసాగుతున్న వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. మేయర్ గా తనకు ప్రోటోకాల్ నిబంధనలను తొలగించారని…తన నేతృత్వంలో జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశాల సమాచారాన్ని కూడా తనకు ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. ఈ క్రమంలో తన ఆత్మ స్థైర్యం కరిగిపోయిందని చెప్పిన మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
వాస్తవానికి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే… రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల పాలక వర్గాలను కైవసం చేసుకునే దిశగా టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేసింది. స్థానిక సంస్థలకు వైైసీపీ అధికారంలో ఉండగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో తాడిపత్రి మునిసిపాలిటీ మినహా అన్ని మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలు వైైసీపీ ఖాతాలోనే పడిపోయాయి. అయితే వైసీపీ గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారడంతో టీడీపీ వేస్తున్న ఎత్తులకు ఒక్కొక్కటిగానే పురపాలికల పాలక వర్గాలు వైసీపీ నుంచి టీడీపీకి మారిపోతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు కార్పొరేషన్ పైనా టీడీపీ గురి పెట్టింది. అయితే వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ వ్యూహాలకు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు.
ఇలాంటి క్రమంలో మేయర్ హోదాలో ఉన్న కావటి మనోహర్ తనకు తానుగా మేయర్ పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పోస్టులో టీడీపి కార్పొరేటర్ కూర్చేనే అవకాశం ఉంది. కార్పొరేషన్ పై తన గ్రిప్ ను కాపాడుకునేందుకు అంబటి చేస్తున్న యత్నాలను టీడీపీ యువ నేత, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే వస్తున్నారు. ఈ రాజకీయ ఎత్తుగడల్లో బాగంగానే… మనోహర్ మేయర్ పదవికి రాజీనామా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే… గుంటూరు కార్పొరేషన్ పై పట్టు కొనసాగించాలన్న దిశగా ఇప్పటిదాకా అంబటి చేసిన యత్నాలన్నీ విఫలం అయిపోయినట్టేనన్న మాట.
This post was last modified on March 16, 2025 12:34 am
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…
షాలిని పాండే గుర్తుందా. విజయ్ దేవరకొండ అనే సెన్సేషన్ తో పాటు సందీప్ రెడ్డి వంగా అనే ఫైర్ బ్రాండ్…
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. తన తొలి భార్యతో వేరు పడి దివ్వెల మాధురితో…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన సుదీర్ఘ ప్రసంగం సింగిల్ సెకండ్ కూడా…