షాలిని పాండే గుర్తుందా. విజయ్ దేవరకొండ అనే సెన్సేషన్ తో పాటు సందీప్ రెడ్డి వంగా అనే ఫైర్ బ్రాండ్ దర్శకుడిని పరిశ్రమకు ఇచ్చిన బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి హీరోయిన్. డెబ్యూతోనే ఇంత పెద్ద హిట్టు సాధించినప్పుడు సహజంగా ఆఫర్లు వెల్లువెత్తుతాయి. కానీ ఈ జబల్ పూర్ బ్యూటీకి అలా జరగలేదు. స్టార్ హీరోల నుంచి పిలుపు రాకపోవడంతో అవకాశాలు పెద్దగా తలుపు తట్టలేదు. ఇదంతా 2017 నాటి ముచ్చట. మధ్యలో రాజ్ తరుణ్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జివి ప్రకాష్ లాంటి అగ్ర, మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఫుల్ లెన్త్, క్యామియోలు చేసింది కానీ అవేవి ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ మహారాజ్ లోనూ ఛాన్స్ దక్కించుకుంది కానీ అదేమో డిజాస్టరయ్యింది. తాజాగా డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించింది. ఒక రకంగా చెప్పాలంటే అర్జున్ రెడ్డి తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర ఇదే. మధ్య తరగతి జీవితాన్ని నెట్టుకురాలేక భర్తతో జర్మనీలో సెటిలయ్యేందుకు కలలు కనే భార్యగా షాలినికి మంచి క్యారెక్టరే దక్కింది. ఆదాయం కోసం అత్త, మరో ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి ప్రమాదకరమైన డ్రగ్స్ వ్యాపారం చేయడమనే పాయింట్ చుట్టూ డబ్బా కార్టెల్ తిరుగుతుంది. మొత్తం ఏడు ఎపిసోడ్లతో దర్శకుడు హితేష్ భాటియా దీన్ని రూపొందించారు.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న డబ్బా కార్టెల్ కు స్పందన బాగానే ఉంది. కొంచెం ల్యాగ్ తో పాటు కొన్ని కంప్లయింట్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొంచెం డీసెంట్ అని చెప్పుకోదగ్గ క్రైమ్ థ్రిల్లర్ ఇదేనని రివ్యూలు పెడుతున్నారు. సూర్య భార్య జ్యోతిక కూడా ఇందులో కీలకమైన రోల్ దక్కించుకున్నారు. అయితే ముంబైలో లక్షలాది మందికి జీవనోపాధిగా నిలిచిన టిఫిన్ బాక్సుల డబ్బా వ్యాపారాన్ని ఇలా చీకటి కోణంలో చూపించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కానీ మేకర్స్ మాత్రం అవేం పట్టించుకోకుండా ఈ ఏడాదిలోనే సెకండ్ సీజన్ కి రెడీ అవుతున్నారు.
This post was last modified on March 15, 2025 4:30 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…