కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దాని కంటే ముందు వచ్చిన కిరణ్ సినిమాలు ఎంత దారుణమైన ఫలితాన్ని అందుకున్నాయో తెలిసిందే. ముఖ్యంగా ‘రూల్స్ రంజన్’ సినిమా చూశాక కిరణ్ మీద ప్రేక్షకులు పూర్తిగా నమ్మకం కోల్పోయిన పరిస్థితి. దీంతో కిరణ్ బ్రేక్ తీసుకున్నాడు. చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ‘క’ సినిమా చేస సక్సెస్ కొట్టాడు. ఇక కిరణ్ గాడిలో పడ్డాడనే అంతా అనుకున్నారు. కానీ తన లేటెస్ట్ రిలీజ్ ‘దిల్ రూబా’ చూస్తే మళ్లీ అతను పాత బాటలోకే వెళ్లిపోయినట్లే కనిపించింది. అందరికీ పాత రోజులే గుర్తుకు వచ్చాయి. ‘క’ తర్వాత కిరణ్ ఇలాంటి సినిమా చేశాడేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కానీ వాస్తవం ఏంటంటే.. కిరణ్ ‘క’ కంటే ముందే చేసిన సినిమా ‘దిల్ రూబా’. కానీ దాన్ని హోల్డ్‌లో పెట్టి ‘క’ సినిమా చేశాడు. మంచి ఫలితాన్నందుకున్నాడు.కిరణ్ అంతకుముందు ఉన్న దారుణమైన ఫ్లాప్ స్ట్రీక్‌లోనే ‘దిల్ రూబా’ సినిమా కూడా రిలీజై ఉంటే అంతే సంగతులు. ఆ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ వచ్చేవి కావు. పైగా తన కెరీర్‌కు చాలా మైనస్ అయ్యేది. అతను ఇంకా కిందికి పడిపోయేవాడు. ఆ సినిమా రష్ చూసుకున్న కిరణ్‌కు దాని మీద నమ్మకం లేకే.. హోల్ట్‌లో పెట్టాడు. అదే సమయంలో ‘క’ తన కెరీర్‌ను మలుపు తిప్పగలదని నమ్మి దాన్ని పూర్తిచేసి రిలీజ్ చేశాడు.
‘క’ సక్సెస్ వల్ల కిరణ్ మీద ప్రేక్షకులకే కాదు.. ‘సరేగమ’ సంస్థకు కూడా గురి కుదిరింది. సినిమాను వాళ్లు కొని రిలీజ్ చేశారు. తద్వారా నిర్మాతలు సేఫ్ అయిపోయారు. సినిమా ఎలా ఉన్నప్పటికీ.. ట్రైలర్ బాగానే కట్ చేయడం, ‘క’ తాలూకు పాజిటివిటీ దీనికి యాడ్ కావడంతో సినిమాకు ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. ముందు రెడీ అయింది కదా అని.. ‘క’ కంటే ముందే ‘దిల్ రూబా’ను రిలీజ్ చేసి ఉంటే కథ వేరుగా ఉండేది. సినిమాకు బిజినెస్సూ అయ్యేది కాదు. బజ్ క్రియేటయ్యేది కాదు. ఓపెనింగ్స్ కూడా వచ్చేవి కావు. మొత్తంగా ‘దిల్ రూబా’ను హోల్డ్‌లో పెట్టి ‘క’ను పూర్తిచేసి రిలీజ్ చేయడం తెలివైన ఎత్తుగడే. అందువల్లే ‘దిల్ రూబా’ను సేల్ చేయగలిగాడు కిరణ్.
This post was last modified on March 15, 2025 5:36 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…