Political News

రేవంత్ రెడ్డి సిసలైన స్టేట్స్ మన్!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన సుదీర్ఘ ప్రసంగం సింగిల్ సెకండ్ కూడా బోర్ కొట్టలేదంటే అతిశయోక్తి కాదేమో. ఓ వైపు ప్రతిపక్షంపై పదునైన విమర్శలు గుప్పిస్తూనే… కేంద్రంలో అధికారంలో ఉన్న మరో విపక్షానికి చెందిన నేతలను కలిస్తే తప్పేమిటని కూడా ఆయన చెప్పిన తీరు నిజంగానే అబ్బురపరచిందని చెప్పక తప్పదు.

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా… తాను వ్యవహరిస్తున్న తీరును ఆయన సమర్థించుకున్న తీరు నిజంగానే… ఆయనలోని రాజనీతీజ్ఞుడిని ఆయన బయటపెట్టేశారని చెప్పక తప్పదు. నిత్యం విమర్శలు చేసుకుంటూ వెళ్లడానికి తానేమీ ప్రతిపక్ష నేతను కాదన్న రేవంత్… తెలంగాణకు ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కూడా రేవంత్ ఏకంగా వార్నింగే ఇచ్చారు.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చే క్మంలో శనివారం రేవంత్ రెడ్డి సభలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. తొలుత తన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు ఓ రేంజిలో సమాధానం ఇచ్చిన రేవంత్ రెడ్డి… దమ్ముంటే ఏ అంశంపై అయినా చర్చకు రావాలని ఆయన విపక్షాలకు సవాల్ విసిరారు.

పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసిందని బీఆర్ఎస్ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ఎవరు ఏం చేశారో కూడా చర్చించేందుకు తాను సిద్ధమేననని ఆయన ప్రకటించారు. తనతో చర్చకు రావాలంటూ ఆయన కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ సభకు ఎందుకు రారంటూ ఆయన కేసీఆర్ పై సెటైర్ల వర్షం కురిపించారు.

అనంతరం తన ఢిల్లీ టూర్లపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన రేవంత్… గడచిన 15 నెలల్లో తాను 32 సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పారు. 300 సార్లు కూడా ఢిల్లీ వెళతానని కూడా ఆయన అన్నారు. ఈ సందర్భంగా తన పర్యటనల వివరాలు చేతబట్టిన రేవంత్… తాను ఢిల్లీకి వెళ్లేది గోటీలు ఆడుకోవడానికా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళుతున్న తాను.. అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూ… రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలను రాబడుతున్నానని తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇప్పటిదాకా 3 సార్లు కలిశానని తెలిపారు. దేశ ప్రధానిగా ఉన్న మోదీ అన్ని రాష్ట్రాలకు బడే భాయేనని కూడా ఆయన అన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందులో తప్పేముందని కూడా ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర కేబినెట్ లోని అందరు మంత్రులను తాను కలిశానని రేవంత్ చెప్పారు. చివరకు తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కూడా తాను కలిశానని తెలిపారు. తాను కలవని కేంద్ర మంత్రి మోదీ కేబినెట్ లోనే లేరని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రులతో బేటీల సందర్భంగా రాష్ట్రానికి ఏమేం తీసుకువచ్చానన్న విషయాన్ని కూడా ఆయన సమగ్ర వివరాలను చదివి వినిపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే అయినా.. ప్రధానిగా మోదీ మాత్రం దేశం మొత్తానికి ప్రధాని అని తెలిపారు. రాజకీయంగా మాట్లాడాల్సి వస్తే… విధాన పరంగా బీజేపీని వ్యతిరేకిస్తాను గానీ.. అభివృద్ధి విషయంలో కేంద్రంలోని ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం, వారికి దూరంగా మసలుకోవడం తగదన్నారు. తాను కూడా ఇదే చేస్తున్నానని చెప్పిన రేవంత్ రెడ్డి… తాను చేస్తున్నది ముమ్మాటికీ కరెక్టేనని చెప్పుకొచ్చారు.

This post was last modified on March 15, 2025 5:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

35 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

54 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago