Political News

చీరల వ్యాపారంలోకి దువ్వాడ… రిబ్బన్ కట్ చేసిన నిధి అగర్వాల్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. తన తొలి భార్యతో వేరు పడి దివ్వెల మాధురితో కలిసి తిరుగుతున్న దువ్వాడ ఏం చేసినా.. ఇట్టే వైరల్ అయిపోతోంది. కుటుంబ తగాదాలను పరిష్కరించుకునే పని ఎంత వరకు వచ్చిందో తెలియదు గానీ.. మాధురితో కలిసి ఆయన చెట్టాపట్టాలేసుకుని తిరుతున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. మాధురితో కలిసి దువ్వాడ శనివారం హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. మాధురితో కలిసి శ్రీనివాస్ వకుళ సిల్క్స్ పేరిట ఓ పట్టు చీరల షోరూమ్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోలు ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

హైదరాబాద్ లోని మియాపూర్, మదీన గూడ పరిధిలో మాధురి, శ్రీనివాస్ లు వకుళ సిల్క్స్ పేరిట పట్టు చీరల షోరూమ్ ను ఏర్పాటు చేయగా… శనివారం ఆ షోరూమ్ ను ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించింది. ఈ సందర్భంగా నల్లటి సూటు బూటులో శ్రీనివాస్ మెరిసిపోయారనే చెప్పాలి. ఇక షోరూమ్ ఎంత రిచ్ గా ఉంటుందన్న విషయాన్ని మాధురి తన అలంకరణతోనే చెప్పేశారని చెప్పాలి. షోరూమ్ ఓపెనింగ్ తర్వాత మాధురి, శ్రీనివాస్ ల మధ్య కూర్చుని నిధి అగర్వాల్ మాట్లాడిన బైట్లు మరింతగా ఆకట్టుకుంటున్నాయి.

వైసీపీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని టెక్కలి కేంద్రంగా రాజకీయం చేస్తున్న దువ్వాడ.. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎప్పటికైనా ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలన్న కసితో సాగుతున్న దువ్వాడ… 2009 నుంచి ప్రయత్నిస్తున్నా ఇప్పటిదాకా సక్సెస్ కాలేకపోయారు. మధ్యలో కాంగ్రెస్ ను వీడి ప్రజారాజ్యంలో చేరిన ఆయన.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. టెక్కలి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా.. శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును దక్కించుకున్న ఆయన.. 2027 మార్చి 29 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

This post was last modified on March 15, 2025 8:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

34 minutes ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

57 minutes ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

1 hour ago

RC 16 – ఒకట్రెండు ఆటలు కాదు బాసూ

రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉంటుందనే టాక్ ఉంది…

2 hours ago

అంతా సిద్ధం!.. టెస్లా రావడమే ఆలస్యం!

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…

4 hours ago

21 ప‌ద‌వులు.. 60 వేల ద‌రఖాస్తులు..

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అనేక మందికి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నామినేటెడ్ ప‌ద‌వుల‌తో సంతృప్తి క‌లిగిస్తున్నారు. ఎన్ని…

11 hours ago