సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో సీరియస్‌గానే యాక్షన్ తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే.. వారిని ప్రశ్నించడం వరకు పరిమితం కావాలని, కానీ, వారి ఇంట్లో ఆడవాళ్లు ఏం తప్పులు చేశారని వారిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని ఆయన నిలదీశారు. అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై స్పందించారు.
“నేను ప్రజాజీవితంలో ఉన్నా. నన్ను విమర్శించండి. కానీ, నా భార్య, నా బిడ్డ ఏం చేసిన్రు? వారిని ఎందుకు తిట్టాలి. అది కూడా బండ బూతులతోనా? ఇలాంటి వారు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. వీరు ఏం జర్నలిస్టులు? ఎవరో ముక్కు మొహం తెలియని వారు ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఇష్టాను సారం కామెంట్లు చేస్తే.. అది ఏం జర్నలిజం? వారు ఎలాంటి జర్నలిస్టులు?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించా రు. ఇలాంటి కామెంట్లు చదివినా.. విన్నా అన్నం కూడా తినాలని అనిపించడం లేదన్నారు.
“ఈ కామెంట్లు చేసిన వారికి ఒక్కటే చెబుతున్నా.. ఒక్కసారి నా పేరు తీసేసి మీరు మీ పేరు పెట్టుకోండి. అప్పుడు ఏమనిపిస్తుందో చూడండి” అని వ్యాఖ్యానించారు. భూభారతి పేరుతో తనపై వస్తున్న కామెంట్లు చదివేందుకు కూడా మనస్కరించడం లేదని అన్నారు. ఇలాంటి వారికి తోలు తీస్తానని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భూభారతి పేరుతో పేదల భూములను వారికే చెందేలా చేస్తున్న తన ప్రయత్నం తప్పా? అని ప్రశ్నించారు. దీనిని అడ్డు పెట్టుకుని తమపై విమర్శలు చేయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెయిడ్ ఆర్టిస్టులతో చేయిస్తున్న ఇలాంటి వీడియోలు అత్యంత దారుణంగా ఉంటున్నాయని సీఎం చెప్పారు. ఇలాంటివి చేయడానికి అసలు మనసు ఎలా వస్తోందని నిలదీశారు. సమస్యలు ఉంటే ఉండొ చ్చునని.. వాటిని హ్యాండిల్ చేయాల్సిన తీరు మాత్రం ఇలా కాదన్నారు. “ఇంతలేసి మాటలు మీ నోటికి ఎలా వస్తున్నాయి. మీరు మనుషులేనా? మీకు భార్య, పిల్లలు లేరా?” అని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
This post was last modified on March 15, 2025 7:37 pm
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
ఏపీలో కీలక ప్రాంతమైన గుంటూరు నగర పాలక సంస్థలో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు మేయర్ గా…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…
షాలిని పాండే గుర్తుందా. విజయ్ దేవరకొండ అనే సెన్సేషన్ తో పాటు సందీప్ రెడ్డి వంగా అనే ఫైర్ బ్రాండ్…
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. తన తొలి భార్యతో వేరు పడి దివ్వెల మాధురితో…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన సుదీర్ఘ ప్రసంగం సింగిల్ సెకండ్ కూడా…