టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తన రాజకీయ ప్రత్యర్థులకు అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదనే చెప్పాలి. గతంలో మాదిరిగా ఒకింత స్వరం పెంచి మాట్లాడటానికి స్వస్తి చెప్పిన లోకేశ్… సుతిమెత్తగానే ప్రత్యర్థులకు చురకలు అంటిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మొదలు అయ్యింది. ఇందులో భాగంగా శాసనమండలిలో వైసీపీ సభ్యురాలు వరుదు కల్యాణి ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులకు సమాధానం చెప్పేందుకు సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, సవితలతో కలిసి లోకేశ్ మండలికి వచ్చారు.
ఈ సందర్భంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ… కేంద్రానికి తన మద్దతు ఉపసంహరిస్తే మోదీ సర్కారు ఏపికి ఏం చేయాలన్నా చేస్తుందని తెలిపారు. అంతటి మంచి అవకాశాన్ని కూటమి సర్కారు ఎందుకు వినియోగించుకోలేకపోతోందని కూడా ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా కల్యాణి వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పిన లోకేశ్… తాము ఎన్డీఏతో ఎన్నికలకు ముందే కలిశామని తెలిపారు. ఏపీకి అండగా నిలవాలన్న ఏకైన అజెండాతోనే అన్ కండీషనల్ మద్దతును బీజేపీకి ఇచ్చామని తెలిపారు. అలాంటప్పుడు టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని ఎలా బెదిరింపులకు దిగుతామని ఆమెను నిలదీశారు. అయినా పార్టీల మధ్య పొత్తుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్న లోకేశ్… వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్రానికి ఏం ఒరగబెట్టిందని ప్రశ్నించారు.
2019 ఎన్నికల్లో వైసీపీకి 22 ఎంపీ సీట్లను రాష్ట్ర ప్రజలు ఇస్తే ఏం చేశారని లోకేశ్ విపక్షాన్ని ప్రశ్నించారు. నాడు సరిపడినన్ని ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న మీ పార్టీ అధినేత జగన్… ఎన్నికల తర్వాత ఏం చేశారని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా జగన్ పేరును లోకేశ్ ప్రస్తావించలేదు. జగన్ ను ఆయన పులివెందుల ఎమ్మెల్యే అంటూ ప్రస్తావించారు. ఆ తర్వాత కూడా అవసరం వచ్చినా కూడా లోకేశ్… జగన్ పేరునే ప్రస్తావించకపోవడం గమనార్హం. పులివెందుల ఎమ్మెల్యే అంటూ జగన్ ను ప్రస్తావిస్తున్న లోకేశ్.. వైసీపీకి ఇకపై ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నట్లుగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సభకు వెన్ను చూపి పారిపోయిన నేతగా జగన్ ను పరిగణిస్తున్న లోకేశ్.. ఆయన పేరును నేరుగా ప్రస్తావించడానికి కూడా ఇస్టపడటం లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
This post was last modified on February 25, 2025 1:29 pm
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…