Movie News

జపాన్ దేశానికి దేవర….తారక్ ప్రమోషన్లు

వచ్చే నెల మార్చి 22 జపాన్ దేశంలో దేవర విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లు మొదలుపెట్టిన టీమ్ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ నే రంగంలోకి దింపింది. గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజైన ఈ బ్లాక్ బస్టర్ తెలుగు, హిందీ వెర్షన్లలో భారీ విజయం నమోదు చేసుకుంది. ఓవర్సీస్ లోనూ పెద్ద నెంబర్లు కనిపించాయి. అరవింద సమేత వీరరాఘవ తర్వాత సోలో హీరోగా వచ్చిన సుదీర్ఘమైన గ్యాప్ కు న్యాయం చేకూరుస్తూ తారక్ అభిమానులను సంతృప్తి పరిచాడు. వెయ్యి కోట్ల మార్కు అందుకోలేకపోయినా అర సహస్రం దాటేయడం చిన్న విషయం కాదు. చాలా చోట్ల పాత రికార్డులు బద్దలయ్యాయి.

జపాన్ మీద దేవర ఇంత ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కారణముంది. యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్, మ్యూజిక్ ఈ నాలుగు అంశాలు బాలన్స్డ్ గా ఉన్న భారతీయ సినిమాలకు ఆ దేశంలో చాలా ఆదరణ ఉంటుంది. ఇప్పటి దాకా టాప్ 1 స్థానంలో ఆర్ఆర్ఆర్ ఉండగా ఆ తర్వాత ముత్తు, బాహుబలి 2, త్రి ఇడియట్స్, ఇంగ్లీష్ వింగ్లిష్, మగధీర, రోబో, ధూమ్ 3, భజరంగి భాయ్ జాన్, పఠాన్, సలార్ లాంటి సూపర్ హిట్లు చాలానే ఉన్నాయి. సో దేవరని కనక సరైన రీతిలో జనంలోకి తీసుకెళితే వసూళ్ల మేజిక్ చేయొచ్చు. అందుకే జూనియర్ అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

నెట్ ఫ్లిక్స్ లో కొన్ని వారాల పాటు ట్రెండింగ్ లో ఉన్న దేవర ఇప్పటిదాకా జపాన్ కు ఏ రూపంలోనూ వెళ్ళలేదు. అక్కడ పైరసీ నిషేధం. మిగిలిన దేశాల ఓటిటిలో దొరికే కంటెంట్ అంతా అక్కడ దొరకదు. మొత్తం ప్రభుత్వం నియంత్రణ, అనుమతులకు లోబడే ఉంటుంది. అందుకే ఎంత లేట్ అయినా సరే మన బ్లాక్ బస్టర్స్ జపాన్ లో రిలీజయ్యేందుకు ఉత్సాహం చూపిస్తుంటాయి. ఇటీవలే కల్కి 2898 ఏడికి అక్కడ ఆశించిన ఫలితం దక్కలేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఆధిపత్యం కాబట్టి జపాన్ జనాలకు అంతగా నచ్చలేదు. కానీ దేవరలో ఆ సమస్య లేదు. బలమైన కథా కథనాలున్నాయి. చూడాలి ఎలాంటి ఆదరణ దక్కుతుందో.

This post was last modified on February 25, 2025 12:45 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

3 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

5 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

5 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

7 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

8 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

9 hours ago