Movie News

మల్లువుడ్ వివాదాలు దేనికి సంకేతం

రాబోయే జూన్ 1 నుంచి తమ రాష్ట్ర సినీ పరిశ్రమను స్ట్రైక్ రూపంలో స్థంబింపజేయాలని నిర్ణయం తీసుకున్న కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పెద్ద ఇరకాటంలో పడేలా ఉంది. దీనికి ఎంత మాత్రం మద్దతు ఇచ్చేది లేదంటూ మళయాలం మూవీ ఆర్టిస్ట్స్ సంఘం (అమ్మ) తేల్చి చెప్పడంతో వ్యవహారం వాడివేడిగా మారిపోయింది. నటీనటుల పారితోషికాలు, పన్ను విధానాలు భారంగా మారాయని, వీటికి పరిష్కారం కనుగొనేంత వరకు ఎక్కడిక్కడ షూటింగ్స్ ఆపేస్తామని కమిటీ తరఫున సురేష్ కుమార్ గతంలోనే ప్రకటించారు. మమ్ముట్టి, మోహన్ లాల్ తదితరులంతా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇలా చేయడం వల్ల వేలాది కార్మికుల జీవనోపాధికి అడ్డు తగిలినట్టు అవుతుందని, అందువల్ల సపోర్ట్ చేయలేమంటూ, పైగా కొందరు ప్రొడ్యూసర్ల స్వార్థ పూరిత ఆలోచనలను సమర్ధించమని చెప్పడంతో వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. సరే ప్రస్తుతానికి ఇది మల్లువుడ్ సమస్యగానే కనిపిస్తున్నప్పటికీ అందరూ ఆలోచించాల్సిన విషయాలు ఇందులో కొన్ని ఉన్నాయి. ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టే తీసుకునేవాడు రేట్ పెంచడం అనేది ప్రతి వ్యాపారంలో ఉన్నదే. కాయగూరల దగ్గర నుంచి ఖరీదైన కార్ల దాకా అందరిదీ ఇదే సూత్రం.కొనేవాడు లేకపోతే ఐఫోన్ లక్షకు పైనే ఎందుకుంటుంది.

అలాంటప్పుడు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా హీరో హీరోయిన్లు రెమ్యునరేషన్లు తీసుకుంటారు. ఒకవేళ అది ఎక్కువనిపిస్తే వద్దనుకుని వేరే ఆప్షన్ చూసుకునే స్వాతంత్రం ప్రొడ్యూసర్ కు ఎప్పుడూ ఉంటుంది. అలా కాకుండా ఇలా స్ట్రైక్ లకు దిగడం ఏమిటనేది ఆర్టిస్టుల వాదన. సొమ్ము తగ్గించుకుంటే మరిన్ని ఎక్కువ సినిమాలు తీస్తామనేది నిర్మాతల వెర్షన్. అయినా కంటెంట్ ఆధారంగా తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసే కేరళలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ వాటిని తట్టుకుని నిలబడటం చూస్తే గ్రేటే అనిపిస్తుంది. అయినా లోగుట్టు పెరుమాళ్ళకెరుకని ఏ ఇబ్బందులు ఎవరికి తెలుసని.

This post was last modified on February 25, 2025 2:02 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

8 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago