Trends

ఆర్సీబీ గెలిస్తే ఆస్తులు ధ్వంసం చేస్తారా… ఇదెక్కడి ఫ్యానిజం?

​ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం శృతిమించి పబ్లిక్ న్యూసెన్స్ గా మారింది. హైదరాబాద్, కర్నూలు లాంటి నగరాల్లో కొందరు తెలుగు యువకులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్ లో బారికేడ్లను ఇష్టమొచ్చినట్లు పడేసి బీభత్సం చేయడంతో, పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. కర్నూలులో కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ రోడ్ల మీద పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి తమ పైత్యాన్ని చాటుకున్నారు.

​ఆర్సీబీ మొదటిసారి కప్పు గెలిచినప్పుడు బెంగుళూరు స్టేడియంలో జరిగిన సెలబ్రేషన్స్ లో తొక్కిసలాట జరిగి ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చేదు సంఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి, ఇప్పుడు రెండోసారి కప్పు కొట్టగానే కొందరు ఫ్యాన్స్ మళ్లీ వీధుల్లోకి వచ్చి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం చాలా దారుణం. ​నిజానికి గ్రౌండ్ లో ప్లేయర్స్ ఎంతో కష్టపడి, చెమటోడ్చి ఆ ట్రోఫీలను గెలుస్తుంటారు. వాళ్ళు కప్పు కొడితే ఫ్యాన్స్ సంతోషించడం సహజమే. కానీ కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తూ సొంత టీమ్ కే చెడ్డపేరు తెస్తున్నారు.

కప్పు గెలిచిన వార్త కంటే, ఫ్యాన్స్ చేసిన ఈ అల్లరి వార్తలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ప్లేయర్స్ పడ్డ కష్టమంతా ఇలాంటి చిల్లర వేషాల వల్ల పక్కదారి పడుతోంది. జట్టు మీద ఉన్న ప్రేమను చూపించడానికి ఇది సరైన పద్ధతి అస్సలు కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని యువత ఇలా పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేయడం అనేది అస్సలు హెల్తీ సెలబ్రేషన్ అనిపించుకోదు. అభిమాన జట్టు గెలిచిందన్న ఆనందాన్ని పది మందితో పంచుకోవాలి కానీ, ఇలా రోడ్ల మీదకు వచ్చి సామాన్యులను ఇబ్బంది పెడుతూ ఆస్తులు ధ్వంసం చేయడం ఎవరికి లాభం? ఈ అతి ప్రవర్తన వల్ల పోలీసుల దెబ్బలు తినడం, కేసులు ఎదుర్కోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు.

​అభిమానం అనేది పాజిటివ్ గా ఉండాలి కానీ, పబ్లిక్ కు ప్రాబ్లమ్ అయ్యేలా ఉండకూడదు. ఫ్యాన్స్ కోసం ప్రాణం పెట్టి ఆడుతూ, కప్పులు గెలిచి ఇస్తున్న ఆ జట్టు ప్లేయర్స్ కోసమైనా సరే ఇలాంటి డిజాస్టర్ సెలబ్రేషన్స్ ఆపేయాలి. ఒక ట్రోఫీ గెలిచిన మూమెంట్ ను ఎంజాయ్ చేస్తూ మంచి జ్ఞాపకంగా మిగిల్చుకోవాలి తప్ప, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఆటను ఆటలా చూస్తూ, బాధ్యత గల ఫ్యాన్స్ గా ప్రవర్తిస్తేనే ఆ జట్టుకు కూడా అసలైన గౌరవం దక్కుతుందని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

This post was last modified on June 1, 2026 11:16 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

6 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

6 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

7 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

7 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

8 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

8 hours ago