Political News

`ఉండ‌వ‌ల్లి`కి ఛాన్స్ లేదా…?

రాజ‌కీయాల్లోకి రావ‌డం.. పోవడం.. అనేది నాయ‌కుల ఇష్టం. అయితే.. మారుతున్న కాలంలో.. నాయ‌కుల ఇష్టాల‌తో పాటు పార్టీల‌కు అవ‌స‌రాలు కూడా ముఖ్యంగా మారాయి. పార్టీల అవ‌స‌రం ఉంటేనే.. నాయ‌కుల‌కు ఎంట్రీ ఉంటోంది. రాజ‌కీయ‌, సామాజిక, ఆర్థిక ప‌రంగా పార్టీల‌కు ద‌న్నుగా మారుతున్న వారిని పార్టీలు ఎప్పుడూ వ‌దులుకునే ప‌రిస్థితిలేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఏలూరులో వైసీపీనాయ‌కుడు ఆళ్ల నాని చేరిక విష‌యంలో టీడీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రిగింది. నిజానికి స్థానిక నాయ‌కులు పెద్ద‌గా ఇష్ట ప‌డ‌లేదు. దీంతో నాని చేరిక వ్య‌వ‌హారం.. ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డింది.

అయిన‌ప్ప‌టికీ.. సామాజికంగా, ఆర్థికంగా కూడా నాని బెట‌ర్ అని భావించ‌డంతో చంద్ర‌బాబు చివ‌ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆయ‌న చేరిక జ‌రిగిపోయింది. ఇక‌, వైసీపీలోనూ ఇలాంటి చేరిక‌లే ఉన్నాయి. ఇటీవ‌ల సాకే శైల‌జానాథ్ వైసీపీలో చేరారు. నిజానికి ఎవ‌రూ కూడా ఓడిపోయిన పార్టీలో చేరేందుకు సిద్ధ‌ప‌డ‌రు. కానీ, ఆయ‌న వ్యూహాలు వేరే ఉండ‌డంతో వైసీపీ కూడా ఎస్సీ సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. దీంతో సాకే ఫ్యాను కింద‌కు చేరిపోయారు. సో.. ఇటు నాయ‌కుల అవ‌స‌రం.. అటు పార్టీల అవ‌స‌రం రెండూక‌లిసి వ‌స్తే.. నేత‌ల చేరిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేందుకు పార్టీలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయి.

ఇక, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న వైసీపీలో చేరుతున్నార‌న్న ప్ర‌చారం గ‌త రెండు వారాలుగా జోరుగా సాగింది. నిజానికి ఆయ‌న తిరిగి రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌న్న ప్ర‌చారం ఎప్ప‌టి నుంచో ఉంది. 2014లో రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. ఆయ‌న రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత‌.. మౌనంగా ఉన్నా.. త‌ర్వాత త‌ర్వాత రాజ‌కీయ విశ్లేష‌కుడిగా మారారు. జ‌గ‌న్ హ‌యాంలో అయితే.. ఆయ‌న పాల‌న‌ను కూడా మెచ్చుకున్నారు. క‌రోనా స‌మ‌యంలో దేశంలోని ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డార‌ని.. కానీ, ఇక్క‌డ ఏపీలో మాత్రం ప్ర‌జ‌లు సేఫ్‌గా ఉన్నార‌ని.. ఆదాయాలు కూడా పెరిగాయ‌ని చెప్పారు.

ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ గూటికి ఉండ‌వ‌ల్లి చేరిపోతార‌ని అప్ప‌ట్లోనూ అనుకున్నారు. ఇక‌, తాజాగా సాకే శైల‌జానాథ్ వంటివారు చేర‌డంతో ఈ ప్ర‌చారానికి మ‌రింత ఊపొచ్చింది. అయితే… ఉండ‌వల్లి మాత్రం చేర‌లేదు. ఇక‌, టీడీపీలో చేరినా అభ్యంత‌రం లేని ఉండ‌వ‌ల్లికి మిత్రుడు, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మ‌రో బాంబు పేల్చారు. అయితే.. ఉండ‌వ‌ల్లి తాజాగా తాను ఏ పార్టీలోనూ చేర‌డం లేద‌న్నారు. వాస్త‌వానికి ఉండ‌వ‌ల్లి చేరుతారా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. సామాజికంగా, ఆర్థికంగా కూడా..ఉండ‌వ‌ల్లికి రాజ‌కీయంగా పుంజుకునే అవ‌కాశం ఇప్పుడు లేదు. దీంతో పార్టీలు సైతం.. ఆయ‌న‌ను చేర్చుకునేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్న చ‌ర్చ ఉంది. అందుకే.. ఉండ‌వ‌ల్లికి ఛాన్స్ లేకుండా పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 20, 2025 10:18 am

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

1 hour ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

2 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

3 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

5 hours ago