Political News

నేను చివరి `రెడ్డి సీఎం` అయినా ఓకే: రేవంత్ మాటలో మర్మమేమిటి?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కుల గ‌ణ‌న త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రి స్థానంలో బీసీల కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, ప్ర‌తిప‌క్ష నేత‌లు కొంద‌రు చేస్తున్న అంత‌ర్గ‌త ప్ర‌చారంపై ఆయ‌న ప‌రోక్షంగా స్పందించారు.

“నేను ఈ రాష్ట్రానికి… కాంగ్రెస్ త‌ర‌ఫున చిట్ట చివ‌రి ముఖ్య‌మంత్రి అయినా ఫ‌ర్వాలేదు. కానీ, కుల‌గ‌ణ‌న మాత్రం ప్రాధాన్యం పొందితే చాలు. త‌ద్వారా.. బీసీల‌కు కొన్ని ద‌శాబ్దాలుగా ద‌క్క‌ని మేలు జ‌రుగుతుంది“ అని రేవంత్ వ్యాఖ్యా నించారు. కుల గ‌ణ‌న ద్వారా బీసీల‌కు ప‌ట్టం క‌డుతున్నామ‌ని.. ఆయ‌న అన్నారు.

కుల‌గ‌ణ‌న స‌ర్వే.. త‌న అభిమ‌త‌మే కాదని.. కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు.. త‌మ నేత రాహుల్ గాంధీ ఆశ‌యం కూడా ఇదేన‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాదు.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. దేశ‌వ్యాప్తంగా కూడా కుల‌గ‌ణ‌ను చేప‌ట్టి ఉండేవార‌మ‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. రాహుల్‌గాంధీ దిశానిర్దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల‌గ‌ణ‌ను చేప‌ట్టిన‌ట్టు తెలిపారు.

ఈ విష‌యంలో కొంద‌రు లేనిపోని ప్ర‌చారం చేస్తున్నార‌ని రేవంత్‌రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. కుల గ‌ణ‌న‌కు స‌హ‌క‌రించ‌ర‌ని వారికి రాష్ట్రంలో ఉండే అర్హ‌త లేద‌న్నారు. “ప్ర‌తిప‌క్షాలు ఈ విష‌యంపై ఆలోచ‌న చేయాలి. కుల‌గ‌ణ‌న అనేది తెలంగాణ అస్తిత్వానికి ప్ర‌తీక‌. దీనిలో పాల్గొన‌ని వారు.. రాష్ట్రంలో ఉండేందుకు అర్హులు ఎలా అవుతారు?“ మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బీసీల‌కు ప‌ట్టం క‌డ‌తారా?

కాగా.. రేవంత్‌రెడ్డి చేసిన చిట్ట‌చివ‌రి ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. కుల గ‌ణ‌న‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని నిర్ణ‌యించింది.

ఈ క్ర‌మంలో అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేస్తే.. అమ‌లు కూడా కానుంది. ఈ నేప‌థ్యంలోనే బీసీల‌కు ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కుతుంద‌న్న ప్ర‌చారం కొన్నాళ్లుగా జ‌రుగుతోంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు కూడా.. దీనికి ద‌న్నుగా మారాయి.

అంటే.. బీసీలు ఎక్కువ‌గా ఉన్నందున‌.. వారికే ఈ సీటు ద‌క్కినా.. త‌న‌కు ఇబ్బంది లేద‌న్న చ‌ర్చ‌కు రేవంత్ తెర‌దీయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం మ‌రో మూడు సంవ‌త్స‌రాల‌కు పైగానే.. కాంగ్రెస్ పాల‌న‌కు అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో రానున్న రోజుల్లో బీసీ నాయ‌కుడికి ముఖ్య‌మంత్రిపీఠం ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

గ‌తంలో ఎస్సీల‌కు సీఎం సీటు ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న వాగ్దానాన్ని నిల‌బెట్టుకోలేదు. ఇప్పుడు నేరుగా బీసీల‌కు సీఎం సీటు ఇస్తామ‌ని చెప్ప‌క‌పోయినా.. రేవంత్ వ్యాఖ్య‌ల అంత‌రార్థం ఇదే కావొచ్చ‌న్న‌ది ప‌రిశీల‌కుల మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 15, 2025 1:21 pm

Share

Recent Posts

న‌మ్మ‌కం లేన‌ప్పుడు.. బాబు చేసిన‌ట్టు చేయొచ్చుగా జ‌గ‌న్‌!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల నిర్వహ‌ణ…

2 hours ago

కసబ్ కు వాళ్లకు తేడా లేదు

స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…

2 hours ago

అది నిజ‌మైతే.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాట‌లు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్న‌ట్టుగానే పార్టీ అధినేత జ‌గ‌న్…

7 hours ago

గీత గోవిందం దర్శకుడికి బ్రేక్ దొరికింది

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…

10 hours ago

మంత్రి ఎదుట జెండాలు పట్టుకుని రోబోల నిరసన..!

"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…

10 hours ago

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

11 hours ago