Trends

మీ భార్య వేరే వ్య‌క్తిని ప్రేమించినా తప్పు కాదు: కోర్టు

సాధార‌ణంగా భార్యా భ‌ర్త అన్నాక‌.. ఒక‌రిపై ఒక‌రికి ప్రేమ‌, అభిమానం, ఆప్యాయ‌త ఉండాలి. మూడు ముళ్ల బంధానికి, ఏడు అడుగుల అనుబంధానికి కూడా అదేఅర్థం.. ప‌ర‌మార్థంగా పెద్ద‌లు చెబుతారు. 1980ల‌లో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు బాపు తీసిన `రాధా క‌ల్యాణం` సినిమాలోనూ ఇదే చూపించారు.

పెళ్లి కానంత వ‌ర‌కు.. ఓ మ‌హిళ‌.. లేదా పురుషుడు ఎవ‌రినైనా ప్రేమించ‌వ‌చ్చు. వారితో ఒక‌వేళ పెళ్లికాక‌పోతే.. పెళ్లి అయిన వారినే ప్రేమించాల‌ని.. జీవితాంతం వారితోనే తోడు-నీడ‌గా గ‌డ‌పాల‌న్న అద్భుత సందేశం ఇచ్చిన సినిమా అది.

“పెళ్లి కానంత వ‌ర‌కు ఎవ‌రి జీవిత‌మైనా.. అద్ద‌మే. దానిలో ఎన్ని ముఖాలైనా చూసుకోవ‌చ్చు. కానీ, పెళ్ల‌య్యాక‌.. అది `ప‌టం`గా మారుతుంది. అందులో ఒక‌రి ముఖ‌మే క‌నిపిస్తుంది“ అనే డైలాగ్ అప్ప‌ట్లో ఫ్యామస్‌. అలాంటి అద్భుత‌మైన పెళ్లి బంధాన్ని చిత్రీక‌రించిన బాపు సినిమా.. ఇప్ప‌టికీ సినిమా ఇండ‌స్ట్రీలో పేరెన్నెకగ‌న్న సినిమా.

అయితే.. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు దీనికి మ‌రో నిర్వ‌చ‌నాన్ని చెప్పుకొచ్చింది. పెళ్లి అయిన‌ప్ప‌టికీ.. భర్తతో సంసారం చేస్తున్న‌ప్ప‌టికీ.. భార్య వేరే వ్య‌క్తిని ప్రేమించ‌వ‌చ్చ‌ని, అత‌నిపై మ‌న‌సు పడ‌వ‌చ్చ‌ని.. ఆప్యాయ‌తా కురిపించ‌వ‌చ్చ‌ని తేల్చి చెప్పింది.

అంతేకాదు.. ఈ విష‌యంలో త‌ప్పుప‌ట్ట‌డానికి కూడా అవ‌కాశం లేద‌ని తెలిపింది. కానీ, సెక్స్ కార్య‌క‌లాపా ల‌కు మాత్రం దూరంగా ఉండాల‌ని కోర్టు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న భార్య వేరే వారిని ప్రేమిస్తోంద‌ని.. ఆమె నుంచి విడాకులు కావాల‌ని కోరిన భ‌ర్త‌కు చీవాట్లు పెట్టింది.

ఆమెకు ప‌రిహారం ఇవ్వ‌డంతోపాటు.. నెల నెలా భ‌ర‌ణం కూడా చెల్లించాల‌ని కోర్టు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. అంటే.. భార్య వేరే వారిని ప్రేమించిన‌ప్ప‌టికీ.. ఆ విష‌యం భ‌ర్త‌కు తెలిసిన‌ప్ప‌టికీ.. కామ్ గా సంసారం చేసుకోవాల్సిందేన‌న్ని కోర్టు తీర్పు భావం!

This post was last modified on February 15, 2025 1:21 pm

Share

Recent Posts

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

7 minutes ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

2 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

3 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

4 hours ago

వివాదాల డోరతి… మనోళ్లు ఇస్తారా హారతి

తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి…

6 hours ago