తాజాగా 14 రోజలు రిమాండ్ పడ్డ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించిన పలు విషయాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ విషయాలు తెలిస్తే.. “వంశీ ఇలాంటి వాడా” అని అనకుండా ఎవరూ ఉండలేరు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై పోలీసులకు పిర్యాదు చేయడంతోపాటు కోర్టలో కేసు వేసిన.. సత్యవర్థన్‌ను వంశీ ఆయన అనుచరులు ఎంతగా వేధించారో.. ఎలాంటి శిక్షలు విధించారో పోలీసులు కళ్లకు కట్టినట్టు రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ కేసులోనే వంశీకి విజయవాడ స్థానిక కోర్టు14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఇక పోలీసులు ఇచ్చిన నివేదికలోని అంశాల విషయానికి వస్తే.. తమపై కేసు పెట్టిన సత్యవర్ధన్‌ను తీవ్రంగా హించారని పోలీసులు తెలిపారు. వంశీ సహా ఆయన ప్రధాన అనుచరులు ఒక రాత్రంతా బట్టలు ఊడదీసి.. నిగ్నంగా నిలబెట్టి చిత్రహింసలు పెట్టారని సత్యవర్ధన్ తమకు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. పదే పదే.. బండ బూతులు తిడుతూ.. మానసికంగా వేధించారని పేర్కొన్నారు.
అంతేకాదు.. సత్యవర్ధన్ తమ మాట వినేలా.. అతని మర్మాయవాలపై తన్నారని పోలీసులు రిపోర్టులో స్పష్టం చేశారు. “మా మీదే కేసు పెట్టే మొగోడివా” అంటూ.. సత్యవర్ధన్‌ను విజయవాడ నుంచి అపహరించి, భయపెట్టి, బెదిరించి..కేసు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేశారు. అంతేకాదు.. సదరు కేసును వెనక్కి తీసుకుంటున్నట్టుగా తామే ఓ అఫిడవిట్‌ను రూపొందించి.. దానిపై సత్యవర్థన్‌తో బలవంతంగా సంతకం తీసుకున్నారని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.
అంతేకాదు.. వంశీ అరాచాకల జాబితాలో సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరించిన విషయం కూడా వెలుగు చూసింది. విజయవాడ ఆయుష్ ఆసుపత్రి వద్ద పొట్టి రాము అనే వ్యక్తిని కలవాలంటూ సత్యవర్ధన్‌పై వంశీ, ఆయన ప్రధాన అనుచరుడు ఒత్తిడి తీసుకొచ్చారని, వంశీ ప్రోద్బలం, ప్రేరేపణతోనే పక్కా క్రమినల్ ప్లాన్‌తో సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు వివరించారు.
“ఆ రోజు రాత్రంతా సత్యవర్ధన్‌ను చిత్రహింసలు పెట్టారు. తమ మాట వినకుంటే.. చంపేయాలనుకున్నారు. విశాఖపట్నం తీసుకువెళ్లి.. ఓ ఫ్లాట్‌లో ఉంచారు. అక్కడి నుంచే కథంతా నడిపించారు” అని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయాలు వెలుగు చూడడంతో గన్నవరం ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వంశీ అంటే.. మంచి నాయకుడని అనుకున్నామని.. కానీ, ఇంత ఘోరానికి ఒడిగట్టే క్రిమినల్ మెంటాలిటీ ఉంటుందని భావించలేదని లోకల్ చానెళ్లతో వ్యాఖ్యానించడం గమనార్హం.