దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయా? జరగవా? ఈ విషయంలో బీజేపీ అడుగులు ముందుకు పడతాయా? పడవా? అనే సందేహాలు తరచుగా తెరమీదికి వస్తూనే ఉన్నాయి. కానీ, మరోవైపు జమిలి ఎన్నికల బిల్లును తెరమీదికి తీసుకువచ్చారు. పార్లమెంటులోనూ ప్రవేశ పెట్టారు. దీనిపై ప్రత్యేకంగా ఆరు మాసాల పాటు అధ్యయనం కూడా జరిగిపోయింది. అయినా.. ఈ సందేహాలు మాత్రం కొనసాగాయి. దీనికి కారణం.. బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో తక్కువ సీట్లు తెచ్చుకున్న దరిమిలా.. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలే.
ముఖ్యంగా జార్ఖండ్, జమ్ము కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో జమిలి పై వెనుకడుగు తప్పదన్న వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, ఈ ఏడాది జరిగిన ఢిల్లీ ఎన్నికలు, ఇటీవల జరి గిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ.. బీజేపీ ఘన విజయం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా దే శరాజధానిలో 27 ఏళ్ల తర్వాత.. కమల వికాసం కనిపించింది. దీంతో పార్టీ పుంజుకుంది. ఇక, తిరుగులేదన్న భావన కూడా వ్యక్తమైంది. దీంతో జమిలి ఎన్నికలకు మొగ్గు చూపడం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.
ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే.. పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, తమిళనాడు, కేరళ, జమ్ము కశ్మీర్, పశ్చిమ బెంగాల్ మినహా.. ఇతర రాష్ట్రాల్లో.. బీజేపీ పూర్తిగా లేదా ఎన్డీయే కూటమితో అధికారంలోకి వచ్చింది. జమిలి ఎన్నికలకు ఈ రాష్ట్రాలు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకున్నా.. తమకు బేఫికర్. సో.. బీజేపీ అనుకున్నది సాధించేందుకు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల మద్దతు చాలు. దీనికి తోడు.. అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ.. ప్రతిపక్షాల పట్టు బీజేపీ వైపు ఉంది.
సో.. ఎలా చూసుకున్నా జమిలి ఎన్నికలకు బీజేపీ రెడీ కావడం పక్కా అని తేలిపోయిందని.. ముహూర్తమే తరువాయని అంటున్నారు పరిశీలకులు. మరీముఖ్యంగా ఢిల్లీలో విజయం దక్కించుకున్న దరిమిలా.. బీజేపీకి తిరుగులేకుండా పోయిందన్న వాదన కూడా బలంగా వినిపిస్తుండడం గమనార్హం.