రాయల్ ఫై జనసేన విచారణ… కీలక ఆదేశాలు జారీ

ఓ మహిళతో వివాహేతర బంధం ఆమెతో ఆర్థికపరమైన సంబంధాలు.. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు… వెరసి జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ ఫై ఓ పెద్ద రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఇదే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే రాయల్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగానే స్పందించారు. . తనకు సంబంధించిన వీడియోలు ఎవరు విడుదల చేస్తున్నారో కనుక్కోవాలని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై జనసేన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విచారణ పూర్తీ ఆయ్యేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ రాయల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ తరఫున ఆదివారం ఓ కీలక ప్రకటన జారీ అయ్యింది. ఈ ప్రకటనలో కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసింది. విచారణను నిస్పక్షపాతంగా చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ మాటతో రాయల్ ఫై విధించిన ఈ నిషేదాజ్ఞలు తాత్కాలికమేనని పార్టీ చెప్పినట్టు అయ్యింది. విచారణ పూర్తి కాగానే రాయల్ యధావిధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

రాయల్ ఫై రేగిన ఈ వివాదం నేపథ్యంలో.. పార్టీ శ్రేణులకు అధిష్టానం కీలక సూచనలు చేసింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై మాత్రమే దృష్ఠి సారించాలని … ఇతరత్రా విషయాలను ఏమాత్రం పట్టించుకోరాదని సూచించింది. సమాజానికి ఉపయోగపడని వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టేయాలని కూడా సూచించింది. అటు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. ఇటు పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉంచాలని కూడా స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.